Guidelines issued for domestic air travel దేశీయ విమానయాన ధరల్లో మార్పులు.. టికెట్ చార్జీలకు రెక్కలు..

Domestic air travel sops 1 3rd flights to operate cap on fare

domestic flights booking news, indigo, spicejet, 25 may flights, Air India, flight booking, goibibo, makemytrip, indigo airlines, cleartrip, flight ticket, easemytrip, go air, hardeep singh puri, mmt, indigo flight, goair, indigo flight booking, goindigo, vistara, flights resume, calibrated, calibrated manner meaning, flight booking news, Ministry of civil aviation, domestic flights

SoPs for the domestic flight services resuming in the middle of lockdown 4.0 were released laying out a detailed plan for the safety of passengers and crew members. Limits on air fares for flights have been set in seven bands. Each band has its specific lower and upper limits of air fare, and the first band consist of flights that are of less than 40 minutes duration.

దేశీయ విమానయాన ధరల్లో మార్పులు.. టికెట్ చార్జీలకు రెక్కలు..

Posted: 05/21/2020 08:49 PM IST
Domestic air travel sops 1 3rd flights to operate cap on fare

దేశీయ విమాన ప్రయాణాలకు శుభవార్తను అందించిన కేంద్రం.. తాజాగా ఈ ప్రయాణాలకు కొత్త ధరలను కూడా నిర్ధేశించింది. దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించిన నేపథ్యంలో కొత్త ధరలను కూడా నిర్ణయించింది కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు గాల్లోకి ఎగరనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కేంద్రం సవరించింది.

విమాన ప్రయాణ సమయం ఆధారంగా 7 కేటగిరీలుగా చార్జీలు ఉంటాయి. ఢిల్లీ-ముంబై రూట్లో టికెట్ ధర గరిష్టంగా రూ.10వేలుగా ఉంటుంది. విమానాల్లో 40 శాతం సీట్లు బ్రాండ్ మిడ్ పాయింట్ కంటే తక్కువ ధరకు అమ్ముతారు. ఢిల్లీ-ముంబై మార్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. కనిష్ట ధర రూ. 3500, గరిష్ట ధర రూ.10,000కు మిడ్ పాయింట్ ధర 6700. అంటే ఈ మార్గంలో రూ.6700 కంటే తక్కువ ధరకే 40శాతం టికెట్లను అమ్ముతారు. ధరలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు DGCA తెలిపింది. మే 25 నుంచి ఆగస్టు 24 వరకు టికెట్ ధరల విషయంలో ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే గతంతో ఈ ధరలను పొల్చిచే మాత్రం ధరలు పెరిగాయని పలువురు పెదవి విరుస్తున్నారు.

టికెట్ ధరల వివరాలు: (కనిష్ట- గరిష్ట ధరలు)

* సెక్టార్- ఎ  40 నిమిషాల లోపు ప్రయాణం - Rs. 2000 to 6000
* సెక్టార్- బి  40-60 నిమిషాల ప్రయాణం - Rs. 2500 to 7500
* సెక్టార్- సి  60-90 నిమిషాల ప్రయాణం - Rs. 3000 to 9000
* సెక్టార్- డి  90-120 నిమిషాల ప్రయాణం - Rs. 3500 to 10,000
* సెక్టార్- ఈ 120-150 నిమిషాల ప్రయాణం - Rs. 4500 to 13,000
* సెక్టార్-ఎఫ్ 150-180 నిమిషాల ప్రయాణం - Rs. 5500 to 15,700
* సెక్టార్- జి 180-210 నిమిషాల ప్రయాణం - Rs. 6500 to 18,600

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles