Railways to partially resume services from May 12 రేపటి నుంచే రైళ్ల రాకపోకలు.. సాయంత్రం నుంచే అన్ లైన్ బుకింగ్..

Indian railways to run special trains to 15 cities from delhi

Ticket booking, IRCTC website, IRCTC, Indian Railways, Latest news on Indian railways, Indian Railways news, Railways news, special trains, special train on May 12, Secundrabad, Indian Railways, Thermal screening, AC special Trains, No Blankets, Platform tickets

Indian Railways plans to gradually restart passenger train operations from 12 May. At the beginning a total of 15 pairs of trains (30 return journeys) will run from New Delhi to various parts of the country.

గుడ్ న్యూస్: రేపటి నుంచే రైళ్ల రాకపోకలు.. సాయంత్రం నుంచే అన్ లైన్ బుకింగ్..

Posted: 05/11/2020 01:50 PM IST
Indian railways to run special trains to 15 cities from delhi

ధేశవ్యాప్తంగా కరోనావైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రైళ్లు, విమానాలతో పాటు బస్సులు సహా అన్ని ప్రజారవాణాలు స్థంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రీన్ జోన్లలో బస్సులు, ఆటోలు, క్యాబ్ లు నడిపేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. కాగా రైల్వే మంత్రిత్వ శాఖ కూడా అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రైళ్లను నడుపేందుకు సిద్దమైంది. మంగళవారం నుంచి పదిహేను రూట్లలో రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లన్ని న్యూఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరనున్నాయి, అంతేకాదు ఇవే నిర్ణత 15 రూట్లలో నుంచి న్యూఢిల్లీకి కూడా రైళ్లు బయలుదేరునున్నాయి.

ఈ నిర్ణీత రూట్లలో న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు కూడా రైలు బయలుదేరనుంది. ఇక న్యూఢిల్లీ నుంచి దిబ్రూగడ్‌, అగర్తల, హవ్‌డా, పట్నా, బిలాస్ పుర్‌, రాంచీ, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్ గావ్‌, ముంబయి సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్మూతావిల మధ్య నడుస్తాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. ఇవన్నీ రాజధాని రైళ్లు తిరిగే మార్గాలు కావడం గమనార్హం. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి అన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఐఆరసీటీసి.

అయితే ఈ రైళ్లలో ప్రయాణించేందుకు రైల్వేస్టేషన్లలో టికెట్లు విక్రయించరు. ఇక రైల్వేస్టేషన్లలోకి కేవలం కన్ఫార్మ్ టికెట్ల వున్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ఇక కన్పార్మ్ టకెట్ ప్రయాణికులు కూడా రైలు బయలుదేరే నిర్ణత సమయానికి గంట ముందుగానే స్టేషన్లకు వచ్చి స్ర్కీనింగ్ పరీక్షలు చేసుకోవాల్సి వుంటుంది. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు వుండవు. ఇక టికెట్ కొనుగోలులోనూ ఎవరికీ ఎలాంటి రాయితీలు వుండవు. ఇక ఈ రైళ్లు పరిమిత స్టేషన్లలోనే నిలుపుతారు. రైళ్లలో పూర్తి ఏసీ సదుపాయం వుండటంతో వాటి మేరకే టికెట్ ధరలు కూడా వుంటాయి. ఇక ఈ రైళ్లలో ఒక్క బోగీలో పూర్తి సామర్థ్యంతో 72 ప్రయాణికులను అనుమతించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles