BJP worker thrashes migrant over train tickets in Gujarat వలస కార్మికుల నుంచి మూడింత టికెట్ దర వసూలు..

Gujarat shocker bjp worker charged 3 times for train fare beat up migrant for objecting

Gujarat shocker, Gujarat bjp leader, surat bjp leader, surat bjp leader assaults migrant labour, BJP worker charged 3 times for train fare, bjp worker beat up migrants, Congress leader, saral patel, asmita nandy, twitter, viral video, video viral

BJP is claiming that states have been asked to pay the share of train ticket money for the migrant labourers a shocking incident has come to light from Gujarat. Rajesh Varma, a BJP’s Surat unit Leader, has duped around 100 migrant labourers by charging them exorbitant amount to purchase tickets.

ITEMVIDEOS: బీజేపి నేత దౌర్జన్యం.. ప్రతిఘటించిన వలస కార్మికుడిపై దాడి..

Posted: 05/08/2020 09:20 PM IST
Gujarat shocker bjp worker charged 3 times for train fare beat up migrant for objecting

ప్రపంచలోని మానవాళిని కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచ ప్రజానికం తమకు తోచిన మేరకు వలస కార్మికులకు సాయం చేస్తున్నారు. కొందరు బోజనాలు ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు నిత్యవసర సరుకులు ఇచ్చి తమలో మానవత్వం ఇంకా మిగిలేవుందని, సాయం చేయడం కన్నా గోప్ప అనుభూతి ఏదీ లేదని నూతన అనుభూతిని పోందుతున్న తరుణంలో ఓ బీజేపి నేత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి వార్తల్లో పతాకశీర్షికల్లో నిలిచాడు. తనకు తోచినంత సాయం చేయకపోగా.. ఈ ప్రమాదకర మృత్యుఘంటికలు మ్రోగుతున్న సమయంలోనూ దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

లాక్ డౌన్ మూడవ విడత అమలుతో వచ్చిన పలు సడలింపుల నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 400 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. ఇక దేశ ప్రగతిలో భాగంగా వివిధ రాష్ట్రాలకు తరలివెళ్లి అభివృద్ధిలో భాగమవుతున్న ఈ వలసకార్మికుల నుంచి రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్ ధరలను వసూలు చేస్తున్నారని కూడా విమర్శలు వచ్చాయి. స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి వలస కార్మికుల టికెట్ ధరలను తాము బనాయించుకుంటామని కూడా చెప్పారు. దీంతో కేంద్ర రైల్లేశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది.

రైల్వే టికెట్లలో 85 శాతం రాయితీ ఇస్తుండగా, 15శాతం మాత్రం రాష్ట్రాలు బనాయించుకోవాలని అదేశాలు ఇచ్చామని, కానీ ఎక్కడా వలస కార్మికుల నుంచి మాత్రం డబ్బు వసూలు  చేయలేదని ప్రకటించారు. అయితే రైల్వే శాఖ కాకుండా బీజేపి నేతలు ఇలా చేస్తున్నారా.? అనే అనుమానాలు కలిగేలా చేశాడో బీజేపి నేత. గుజరాత్ లోని ఓ బీజేపి నేత కార్మికులు నుంచి అన్యాయంగా టికెట్ ధరల పెరుతో మూడింతల డబ్బులు దండుకోవటమే కాకుండా.. ఇదేంటని అడిగిన ప్రశ్నించిన ఓ వలస కార్మికున్ని విచక్షణా రహితంగా.. రక్తపు గాయాలు అయ్యేలా చావ చితకబాదాడు.

ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్ కు చెందిన వలస కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా వీరిని సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. రైలు టిక్కెట్‌ తీసుకునే అవకాశం లేకుండా ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. కానీ, సూరత్‌కు చెందిన రాజేష్‌ వర్మ అనే బీజేపీ నేత ఏకంగా 100 మంది వలస కార్మికుల నుంచి టిక్కెట్ల ధరల రూపంలో దాదాపు రూ.3 లక్షలు వసూలు చేశాడు.

ఒక్కోటిక్కెట్‌ ధరకు మూడురెట్లు అధికంగా డబ్బులు వసూలు చేశాడు. వాసుదేవ వర్మ అనే వలస కూలీ టిక్కెట్ల ధరల విషయమై అతడ్ని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్‌, అతడి అనుచరులు వాసుదేవను చెక్క దబ్బలతో, రాళ్లతో చావగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సరల్‌ పాటెల్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు దీన్ని తన ట్విటర్‌ ఖాతో పోస్ట్‌ చేశాడు. కాగా, దాడికి పాల్పడ్డ రాజేష్‌ వర్మకి బీజేపీతో అసలు సంబంధమే లేదని అధికార బీజేపీ పార్టీ చెబుతుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh