President, PM and Political Leaders Condole Vizag Deaths విశాఖలో విషవాయువులపై ప్రముఖుల దిగ్భ్రాంతి..

Visakhapatnam gas leak president pm and political leaders condole vizag deaths

PM Modi on gas leak, Amit shan on gas leak, Rahul Gandhi on gas leak, KCR on gas leak, President on gas leak, vizag gas leak, Visakha gas leak, RR Venkatapuram, LG Polymers, Visakhapatnam, Ramnath Kovind, PM Modi, Amit shah, Rahul Gandhi, KCR, andhra Pradesh, Politics

Prime Minister Narendra Modi tweeted that he spoke to the officials of Ministry of Home Affairs and National Disaster Management Authority (NDMA) regarding the situation in Visakhapatnam and he was closely monitoring it. He also said he is praying for everyone’s safety and well-being in Visakhapatnam.

విశాఖలో విషవాయువులపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి..

Posted: 05/07/2020 12:45 PM IST
Visakhapatnam gas leak president pm and political leaders condole vizag deaths

విశాఖ ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన విషవాయువు లీకైన దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు గాఢనిద్రలో వున్న సమయంలో గ్యాస్ లీక్ అవ్వడం.. వారు నిద్రలోనే దానిని పీల్చి అస్వస్థతకు గురికావడంపై రాజకీయ ప్రముఖులు తమ అవేదనను వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరులు ట్విటర్‌ ద్వారా స్పందించారు.

* విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రభుత్వాలు, అధికారులు వేగంగా చర్యలు తీసుకుని పరిస్థితిని త్వరగా అదుపులోకి తీసుకువస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

* విశాఖలో గ్యాస్‌ లీకేజీ ఘటనకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై హోం శాఖ, విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడా. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా. విశాఖలోని ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నివిధాలా పూర్తి సహాయం అందిస్తామని అన్నారు.

* విశాఖ శివారులోని ఓ ప్రైవేటు పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైన ఘటనలో జరిగిన ప్రాణనష్టం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ దారుణ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ వషయంలో సంబంధిత అధికారులతో పాటు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ సహా ఎన్డీఆర్ఎఫ్ బలగాలతోనూ తాను మాట్లాడానని, వెంటనే చర్యలు చేపట్టామని వారు తనకు తెలిపారని ఆయన అన్నారు. కాగా ఈ ఘటనలో  బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అయన అన్నారు.

* విశాఖ ఘటన మనసును కలచివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ సా అన్నారు. విశాఖ ఘటనపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో నిరంతరం టచ్ లో వున్నామని, అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషాద వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని అన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.

* విశాఖ పాలీమర్‌ పరిశ్రమ దుర్ఘటన బాధాకరమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కోన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సహాక చర్యలు చేపట్టాయని అమె తెలిపారు బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

* విశాఖలో రసాయన విషవాయులు లీకైన ఘటన హృదయాన్ని ధ్రవింపజేస్తోందిని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషాద సమయంలో సమీపంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు బాధితులకు పూర్తి తోడ్పాటును సహకారాన్ని అందించాలని కోరారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆయన మృతులకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తున్నట్లు తెలిపారు

* విశాఖ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీర్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి తన  సానుభూతిని వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా భయంకరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

* విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఇది ఒక దురదృష్టకర సంఘటనగా పేర్కోన్న ఆయన ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించారు.

* విశాఖ గ్యాస్ లీక్ ఘటన హృదయవిదారకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం, వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని.. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇలాంటి ఘటనలు విశాఖలో తరచూ జరుగుతున్నాయని, ఇకపై అవి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీటి వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని అధికారులు ఇలాంటి ఘటనలపై బాద్యతగా మెలగాలని పవన్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles