special-train-ferries-migrants-from-telangana-to-jharkhand స్వస్థలాలకు వలస కార్మికులు.. ఇలా ఘనవీడ్కోలు..

Watch non stop special train ferries migrants from telangana to jharkhand

telangana to jharkhand, covid-19, stranded migrants, india lockdown, railways, transportation, migrant workers from jharkhand, special train leaves from hyderabad, firtst special train, non stop train, migrant workers, Lingampally, IIT Hyderabad, Kandi, Telangana, Jharkhand, Bihar

A train from Hyderabad's Lingampalli, carrying nearly 1,200 migrant workers, reached Hatia in Jharkhand on Friday morning. This was first train to ferry migrants amid nationwide lockdown, said railway ministry.

స్వస్థలాలకు వలస కార్మికులు.. ఇలా ఘనవీడ్కోలు..

Posted: 05/01/2020 03:00 PM IST
Watch non stop special train ferries migrants from telangana to jharkhand

కరోనావైరస్ మహమ్మారి విజృంభనను కట్టడి చేసేందుకు మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వలస కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఈ క్రమంలో తొలిదశ లాక్ డౌన్ నేపథ్యంలోనే అలాగే వుండిపోయిన కార్మికులు, రెండో దశ లాక్ డౌన్ ముగుస్తున్న తరుణంలో తమను తమ స్వరాష్ట్రాలకు పంపాలని డిమాండ్ తో పాటు తమ వారికి జీతాలు ఇవ్వకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారని ఒక్కసారిగా నిరసనను వ్యక్తం చేశారు, దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్, జిల్లా ఎస్సీలు వారిని వినతి విని వారిని తమ రాష్ట్రాలకు పంపుతామని హామి ఇచ్చారు.

విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన కేంద్రప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడి నుంచి కార్మికులను జార్ఖండ్ సహా బీమర్, హాతియా సహా పలుప్రాంతాలకు పంపేందుకు 24 బోగీలతో కూడా రైలును లింగంపల్లికి పంపారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన తరువాత తొలిసారిగా ప్రయాణిస్తున్న రైలు ఇదే. వలస కార్మిక ప్రయాణికులతో కదిలిన రైలుకు 24 బోగాలతో కదిలింది. ప్రతీ బోగీలో 72 బర్త్ లు వున్నప్పటికీ అధికారులు సామాజిక దూరం పాటించాలన్న ఉద్యే్యంతో కేవలం 54మందిని మాత్రమే అనుమతించారు. ఈ రైలులో దాదాపు 1,200 మంది వలస కార్మికులు ప్రయాణించారు.

కాగా, వలస కార్మికులను రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రాల నుంచి ఒత్తిడి రావడంతో కేంద్రం నిబంధనలను సడలించింది. దీంతో రాష్ట్రానికి వలస కూలీలుగా వచ్చిన ఝార్ఖండ్ వాసులను ఇవాల స్వస్థలాలకు పంపింది. హైదరాబాద్ ఐఐటీలో ఆశ్రయం పొందుతున్న జార్ఖండ్ వాసులను 57 బస్సుల్లో తెల్లవారుజామున లింగంపల్లి స్టేషన్ కు తరలించారు. ఆపై వారిని రైలులోకి అనుమతించారు. ఇన్నాళ్లుగా ఇక్కడి అధికారులతో వున్న సంబంధాల నేపథ్యంలో కార్మికులు అధికారుల నుంచి వీడ్కోలు తీసుకుని రైలు ఎక్కారు. కాగా రైలులో వెళ్తున్న తమ కార్మికులను క్షేమంగా చేరుకోవాలని.. అధికారుల కరతాళధ్వనులతో ఘన వీడ్కోలు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles