Rainfall in GHMC and parts of Telangana నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. పలుచోట్ల జల్లులు..

Rainfall in greater hyderabad and parts of telangana

rainfall in Telangana, Southern peninsula of India, rainfall activity for this week, IMD weather forecast, rainfall forecast, Rainfall in GHMC, weather news, rainfall, low pressure area, GHMC weather, weather report, weather updates, rain, rains in india, rain in telangana

According to the India Meteorological Department (IMD), under the influence of wind discontinuity rainfall and thundershower is likely over Telangana during the next 3-4 days. Wet conditions are also expected to continue over parts of Telangana for the next 4 days.

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. పలుచోట్ల జల్లులు..

Posted: 04/28/2020 04:34 PM IST
Rainfall in greater hyderabad and parts of telangana

తెలుగు రాష్ట్రాల్లోనే ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వున్నారు. కాగా వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల వర్షం కురిసింది. పలు చోట్ల వర్షం జల్లులు పడ్డాయి. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో అది మరింత బలపడి, తీవ్రంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈ అల్పపీడనం ఈ నెల 30 నుంచి మే 3 వరకూ ఉండనుందని అండమాన్ నికోబార్ దీవుల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. ఎండ తీవ్రత, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొందని అన్నారు. ఈ ప్రభావంతో రేపు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

హైదరాబాద్‌ నగర శివారులను ఆకస్మికంగా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఉదయం నుంచి మండుటెండలతో జనం ఇళ్లల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోతుండగా.. సాయంత్ర వేళలో వరుణుడు ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగించాడు. నగర శివారుల్లోని శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేట్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఈసీఐఎల్‌, జవహర్‌ నగర్, దమ్మాయిగూడ, సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాలతో పాటు.. శామీర్‌ పేట వైపు కూడా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగిపోయాయి. ఇక ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles