playing cards spread corona in andhra pradeshఅంటువ్యాధి అంటే ఇదే: పేకాటతో 39 మందికి కరోనా పాజిటివ్

Playing cards spread corona in krishna district of andhra pradesh

Lorry driver, Krishna lanka, playing cards, corona positive, imtiaz ahmed, district collector, lockdown, vijayawada, krishna, Andhra pradesh

According to the details revealed by Krishna District collector Imtiaz Ahmed, In two different cases in krishna district 30 had been tested coronavirus positive after gathering in a room of one of the locals house to play cards.

అంటువ్యాధి అంటే ఇదే: పేకాటతో 39 మందికి కరోనా పాజిటివ్

Posted: 04/25/2020 06:55 PM IST
Playing cards spread corona in krishna district of andhra pradesh

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని ఎంత చెబుతున్నా కొందరికి పట్టడం లేదు. ఊరికే తిని తొంగుంటే మనిషికి, పశువుకు పెద్ద తేడా ఉండదని కాబోలు కొందరు తమ ఇరుగుపోరుగు వారితో కలసి సరదాగా అటాడుకున్నారు. సమయం దొరికింది కదా అని కాలక్షేపానికి వారు తెరతీస్తే.. అదే మార్గంలో వారిని ప్రభావితం చేసింది కరోనా వ్యాధి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 39 మందికి కరోనా సోకింది. ఇది కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకుంది.

రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ వెల్లడించిన మేరకు ఇలా వున్నాయి. కృష్ణలంకలో లారీ డ్రైవర్‌ లాక్ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మూలంగా 24 మంది కరోనా బారిన పడ్డారని వివరించారు. తిరిగే కాలు ఒక్క చోటు కూర్చోమంటే ఎలా కూర్చుంటుందని.. తన ఇరుగుపోరుగు వారితో కాలక్షేపం చేయాలని భావించాడు. అంతే వారిని పిలిచి అతడు పేకాట ఆడాడని చెప్పారు. వీరితో పాటు ఇరుగు పొరుగు వారి పిల్లలు, మహిళలు కూడా హౌసీ ఆడారని కలెక్టర్‌ తెలిపారు. దీంతో మొత్తం 24 మందికి కరోనా సోకిందన్నారు.

ఇక విజయవాడలోని మరో ఘటనలో 15 మందికి ఇలాంటి చర్యల ద్వారానే కరోనా సోకింది. కార్మికనగర్ లో మరో లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల 15 మందికి కరోనా సోకిందని కలెక్టర్‌ వివరించారు. డ్రైవర్‌ తన కుటుంబ సభ్యులు, పొరుగువారిని కలవడం వల్ల వారికి కరోనా సోకిందని తెలిపారు. భౌతికదూరం పాటించకపోవడం వల్లే ఈ రెండు ఉదంతాలూ జరిగాయని కలెక్టర్‌ చెప్పారు. ప్రజలు భౌతికదూరం పాటించకుంటే కరోనా నియంత్రణ కష్టమని చెప్పారు. రెడ్‌జోన్‌లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

రేపు మాంసం, చేపల అమ్మకంపై నిషేధం

విజయవాడలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. విజయవాడ నగరంలో రేపు చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలపై నిషేధం విధించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్‌ మూసివేస్తున్నట్టు వీఎంసీ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles