Coronavirus: US reports 4491 deaths in 24 hours అగ్రరాజ్యంలో కరోనా కరాళ నృత్యం: ఒక్కరోజే 4491 మరణాలు

Us marks record 4491 coronavirus deaths in 24 hours johns hopkins data

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

The US has become the world's first country to have registered Covid-19 deaths in a single day with 4491 fatalities reported in the past 24 hours, while the number of infections in America has crossed 650,000, the highest in the world, according to Johns Hopkins University data.

అగ్రరాజ్యంలో కరోనా కరాళ నృత్యం: ఒక్కరోజే 4491 మరణాలు

Posted: 04/18/2020 02:39 PM IST
Us marks record 4491 coronavirus deaths in 24 hours johns hopkins data

అగ్రరాజ్యంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయి. కరోనావైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యంలోని లక్షలాధి మంది దీని బారిన పడి చికిత్స పోందుతుండగా, దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 32 వేలు దాటింది. గత కొన్నాళ్లలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన మరణాలు అత్యధికంగా 4491గా సంభవించాయి. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య అగ్రరాజ్యంలో ఆరున్నర లక్షల మార్కు దాటింది. దీంతో అక్కడి వారిలో ఈ మరణాలు తీవ్ర అందోళనను రేకెత్తిస్తు్నాయి. ఒకే రోజులో నాలుగ వేల ఐదు వందల చేరువలో కరోనా వైరస్ మరణాలు సంభవించాయని జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

అమెరికాలో మొత్తం 32,917 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇక ఒక రోజులో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో ఇదే తొలిసారి. ఇందులో గతంలో చేర్చని కోవిడ్-19కు సంబంధించిన సంభావ్య మరణాలు కూడా ఉన్నాయి. కాగా, మొత్తం మరణాల్లో 3,778 సంభావ్య మరణాలను చేర్చినట్టు న్యూయార్క్ నగరం ప్రకటించింది. గురువారం రాత్రి నాటికి ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ 31,071 మరణాలను నమోదు చేసింది. ఇందులో 4,141 సంభావ్య మరణాలు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు అగ్రరాజ్యం అమెరికాలోనే నమోదు అవుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక పరంగా, వైద్య అరోగ్యరంగంలో విప్లవాత్మక అభివృద్ది సాధించిన అమెరికాలో మరణాలు నమోదు కావడం అందోళనకరంగా వుంది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ ఉంది. అక్కడ ఇప్పటి వరకు 22,170 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 19,130 మంది, ఫ్రాన్స్‌లో 17,920 మంది మరణించారు. అమెరికాలో మొత్తంగా 6,67,800 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎపిక్ సెంటర్‌గా మారిన న్యూయార్క్‌లోనే 12 వేల మందికిపైగా మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles