Airlines to refund fares for bookings during lockdown టికెట్ ధరలను పూర్తిగా చెల్లించాలని ఎయిర్ లైన్స్ కు కేంద్రం అదేశం

Airlines must give full refund for flight bookings during lockdown period dgca

DGCA, civil aviation, airline ticket refund, DGCA refund rules. india airlines, india flight tickets, india flight bookings, flight cancellation, plane cancellation, flight cancellation rules, lockdown flights, lockdown stories, india lockdown, coronavirus india, india coronavirus, coronavirus update, india corona, coronavirus cases in india, india coronavirus news, india coronavirus lockdown, covid 19, Crime

Airlines will have to refund full fares, without imposing cancellation charges, to those who booked tickets during the first lockdown from 25 March to 14 April for travel between 25 March and 3 May, the civil aviation ministry said

టికెట్ ధరలను పూర్తిగా చెల్లించాలని ఎయిర్ లైన్స్ కు కేంద్రం అదేశం

Posted: 04/17/2020 01:44 PM IST
Airlines must give full refund for flight bookings during lockdown period dgca

లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో, ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులను ఇవ్వలేమని, దీనికి బదులుగా ప్రయాణ తేదీలను పోస్ట్ పోన్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని, ఎయిర్ లైన్స్ సంస్థలు స్పష్టం చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణాలు చేయలేకపోయిన వారికి పూర్తి స్థాయిలో రిఫండ్ ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఎటువంటి క్యాన్సిలేషన్ చార్జీలు విధించకుండా పూర్తి మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని, గరిష్ఠంగా మూడు వారాల్లో డబ్బు వెనక్కు ఇవ్వాలని పౌర విమానయాన శాఖ ఓ సర్క్యులర్ లో ఎయిర్ లైన్స్ కంపెనీలను ఆదేశించింది. అయితే, ప్రయాణికులు మే 3 వరకూ బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసిన కేంద్రం, రిఫండ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించింది.

కాగా, ఎయిర్ లైన్స్ సంస్థలు విస్తారా, గో ఎయిర్ తదితరాలు, తాము రిఫండ్ ను చేయలేమని ప్రకటించిన తరువాత, సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం స్పందించింది. ఇండియాలో రెండో దశ లాక్ డౌన్ మే 3 వరకూ అమలులో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles