Lockdown: Plea in SC for Free Calls, Data and DTH లాక్ డౌన్ లో ‘అవి’ ఉచితంగా ఇవ్వాలని సుప్రీంలో వాజ్యం

Free unlimited calls data sought by plea in supreme court during covid 19 lockdown

Coivd-19, coronavirus outbreak, Coronavirus, covid-19 free unlimited calls, coronavirus free data, coronavirus free dth, corona lockdown plea in supreme court, coronavirus free internet, coronavirus, supreme court of india, sc plea, covid 19, National Politics

A petition has been filed in the Supreme Court seeking a direction to the Centre to ensure that free unlimited calling, data usage and DTH facilities are provided to subscribers to ease "psychological stress" during the lockdown till May 3 due to the COVID-19 pandemic.

కరోనా లాక్ డౌన్: నిర్భధంలో ‘అవి’ ఉచితంగా ఇవ్వాలని సుప్రీంలో వాజ్యం

Posted: 04/16/2020 08:53 PM IST
Free unlimited calls data sought by plea in supreme court during covid 19 lockdown

లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ప్రజలందరినీ ఇళ్లకు మాత్రమే పరిమితం చేసిన నేపథ్యంలో దేశప్రజలందరికీ ఇది ఒక తరహాలో శిక్షలాంటిదేనని.. దీని నుంచి వారు ఉపశమనం పొందాలంటే కేంద్రప్రభుత్వం వారికి కొన్నింటిని ఉచితంగా అందించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాజ్యం దాఖలైంది. అవేంటంటే అపరిమితి కాలింగ్‌, డేటా, డీటీహెచ్‌ సదుపాయాలు. వీటిని ఉచితంగా అందించాలని మనోహర్‌ ప్రతాప్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజల మానసిక ఒత్తిడిని దూరం చేయాలంటే ఇది తప్పనిసరని పేర్కొన్నారు. నిర్బంధంలో ఉండటంతో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకొనేలా ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ఆయన కోరారు.

అన్ని ఛానళ్లు వచ్చేలా డీటీహెచ్‌ సేవలు ఉచితంగా అందించేలా ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను ఆదేశించాలని వ్యాజ్యంలో ప్రతాప్‌ కోరారు. వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్లు ఉచితంగా వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అపరిమితంగా ఆడియో, వీడియో కాలింగ్‌, డేటా, డీటీహెచ్‌ ద్వారా లాక్‌డౌన్‌లో ప్రజల మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. వలస కూలీలు, పేదలకు ఉచితంగా ఆహారం, బస అందిస్తున్నప్పటికీ  పౌరులపై నానాటికీ పెరుగుతున్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

‘శారీరక ఆరోగ్యం మాదిరిగానే మానసిక ఆరోగ్యం అత్యంత కీలకం. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. లాక్‌డౌన్‌లో చాలామంది తమ కుటుంబాలు, సన్నిహితులకు దూరంగా ఉన్నారు. వారు కుంగుబాటుకు లోనవుతున్నారు. క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో కొందరు ఆత్యహత్య చేసుకొనేందుకు ప్రయత్నించారు. అపరిమితంగా ఉచిత ఆడియో, వీడియో కాలింగ్‌, డేటా, డీటీహెచ్‌ సదుపాయాలు కల్పిస్తే కుటుంబాలకు దూరమైన వారికి ఉపశమనం కలుగుతుంది. క్వారంటైన్‌ కేంద్రాల్లోనూ ఇంటర్నెట్‌, టీవీ సేవలు ఉండాలి’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles