60 new covid-19 cases in AP ఏపీలో 266కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Ap reports 60 new covid 19 cases tally rises to 266

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Sixty more persons tested positive for coronavirus in Andhra Pradesh since Sunday night, taking the state's total such cases to 266. According to a Health Department bulletin at 10 am on Monday, the new cases have been reported since 10 pm on Sunday.

ఆంధ్రప్రదేశ్ లో 266కు చేరిన కరోనా కేసులు.. హైఅలర్ట్ ప్రకటించిన సీఎం

Posted: 04/06/2020 11:01 AM IST
Ap reports 60 new covid 19 cases tally rises to 266

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు వేలకు దాటిపోగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేసులు 266కు చేరుకున్నాయి. మర్కజ్‌ సదస్సు కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదవగా.. అందులో కర్నూలులో అత్యధికంగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6గంటల నుంచి 9గంటల వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 14కేసులు నమోదు అయ్యాయి.

కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖ నుంచి 5, అనంతపూర్ నుంచి 3 కర్నూల్ నుంచి 3 గుంటూరు నుంచి 2, పశ్చిమగోదావరిలో ఓ కేసు నమోదు అయ్యింది. తాజా నివేధికల ప్రకారం నెల్లూరు- 34, గుంటూరు- 32, కృష్ణా- 28, ప్రకాశం- 23, కడప- 23, చిత్తూరు-17, విశాఖ- 20, పశ్చిగోదావరి-16 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి- 11, అనంతపురం-6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా చికిత్స అందించాలన్నారు. కరోనా నియంత్రణపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌  సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చినవారిని గుర్తించి త్వరగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి ఆరోగ్య సర్వే నిరంతరం జరుగుతుండాలని ఆదేశించారు. కరోనా వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles