Coronavirus: US reports over 5000 deaths అమెరికాలో ఐదు వేలకు చేరిన కరోనావైరస్ మృతులు

Coronavirus us reports over 5000 deaths 1480 deaths in 24 hours

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

The novel coronavirus has infected more than 1.1 million people and killed more than 59,000 worldwide, according to Johns Hopkins University. The US has 270,000 cases and more than 7,100 deaths, according to revised figures.

కరోనా కరాళ నృత్యం: అగ్రరాజ్యంలో ఐదు వేలకు చేరిన మరణాలు

Posted: 04/04/2020 12:11 PM IST
Coronavirus us reports over 5000 deaths 1480 deaths in 24 hours

కరోనా వైరస్‌ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ తరుణంలో పరోక్షంగా కూడా దీని ప్రభావం బారిన పడి పలువురు మరణిస్తున్నారు. కొందరు ఈ భయంకర మహమ్మారి గురించి తెలుసుకుని అందోళన చెందిన మరణించగా, మరికోందరు రోగం బారిన పడి మరణిస్తున్నారు. కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ విజృంభించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఫలితంగా  అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయింది. మృతదేహాలపై కప్పే లక్ష కవర్లు అర్డర్ ఇచ్చారన్న వార్తలతో అక్కడ కరోనాైవైరస్ ఎంతలా విలయతాండవం చేస్తోందో ప్రపంచ దశాలకు అర్థం అవుతోంది.

ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో  మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా అమెరికా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని వదిలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. తమ దేశ ప్రజల ప్రాణాలను రక్షించాలన్న వినతులు కూడా వెల్లివిరుస్తున్నాయి. గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది.

అమెరికాలో ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 32 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదుకాగా, ఏకంగా 1480 మరణాలు సంభవించాయని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రభావితమైన రాష్ట్రాల్లో స్టే అట్ హోం. సెల్ప్ క్వారంటైన్ కొనసాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మరణాల సంఖ్య 59 వేలు దాటింది. అన్ని దేశాలలో కలపి ఇప్పటివరకు సుమారు పదకొండు లక్షల మంది ప్రజలు ఈ వైరస్ భారిన పడినట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయని  ఈ మేరకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles