Man Shot At For Asking People To Stay Indoors క్వారంటైన్ చేయాలని సూచించిన వ్యక్తిపై కాల్పులు..

Man shot at for asking people to stay indoors during lockdown in up

kakroli shooting, muzaffarnagar shooting, uttar pradesh shooting, javeed, firing in Uttar Pradesh, muzaffarnagar firing, illegally carrying weapons, Murder attempt, lucknow firing, lock down, coronavirus, Uttar Pradesh, Crime

A 30-year-old man was shot at by a group of people that was wandering outdoors after he asked them to stay in their homes and abide by the lockdown restrictions at Kakroli village in Muzaffarnagar district, police said.

క్వారంటైన్ చేయాలని సూచించిన వ్యక్తిపై కాల్పులు.. కలకలం రేపిన ఘటన

Posted: 04/03/2020 04:59 PM IST
Man shot at for asking people to stay indoors during lockdown in up

కరోనా మహమ్మారి ఎంతటి ప్రమాదకారో అన్న విషయం తెలియకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. అకాతాయిలు రోడ్లుపై తిరుగుతున్న దృష్యాలు మనం అనేకం చూస్తూనే వున్నాం. ముంచుకొస్తున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని దేశ ఆర్థిక పరిస్థితి అటుపోట్లకు గురవుతున్నా.. ప్రజారోగ్యమే పరమావధి అని భావిస్తున్న కేంద్రప్రభుత్వం.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కొందరు అత్యవసర పరిస్థితుల్లో లేదా నిత్యావసర సరుకులు తీసుకువచ్చే క్రమంలో బయటకు వస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా మినహాయింపును కల్పించింది.

అయితే ఇదే మినహాయింపును  వినియోగించుకుంటున్న అకతాయిలు రోడ్డలు ఎంత విస్తారంగా వున్నాయో.. ఎవ్వరూ లేకుండా ఎంత ఖాళీగా వున్నాయో.. అంటూ ఏ పని లేకపోయినా ఊరికే బయట రోడ్లపై తిరుగుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వారిని ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు పదేపదే చెబుతున్నా కొందరు నిషేధాజ్ఞ‌లను అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ హంగామా చేస్తున్నారు. అదేమని అడిగితే తిరిగి దాడులకు తెగబడుతున్న దారుణ పరిస్థితులున్నాయి. బయట ఎందుకు తిరుగుతున్నారు.. ఇంటికెళ్లమని చెప్పినందుకు ఏకంగా తుపాకీ తీసి కాల్పులు జరిపిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో కలకలం రేపింది.

ముజఫ్ఫర్‌నగర్ జిల్లా కాక్రోలిలో చోటుచేసుకున్న ఓ ఘటనలో లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై అనవసరంగా తిరగడం మాని.. ఇంట్లో కూర్చోమని చెప్పినందుకు ఆరుగురు ఆకతాయి యువకులు.. ఇద్దరు అన్నదమ్ములపై దాడి చేసి కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతుండడంతో అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు జావేద్, దిల్షాద్ ప్రశ్నించారు. ఇళ్లలో ఉండకుండా బయట ఎందుకు తిరుగుతున్నారంటూ నిలదీశారు. ఈ క్రమంలో ఇరువర్గా ల మధ్య మాటామాటా పెరిగింది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆరుగురు యువకులు అన్నదమ్ములపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా తుపాకీ తీసి కాల్పులు జరిపారు. కాల్పుల్లో జావెద్ తీవ్రంగా గాయపడ్డాడు. బుల్లెట్ అతని శరీరంలో నుంచి దూసుకెళ్లింది. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దాడికి పాల్పడిన యువకులు పరారయ్యారు. అకతాయి యువకుల వద్దకు తుపాకీ ఎలా వచ్చింది.? అన్న కోణంలో అక్రమ మారణాయుధాల కేసులతో పాటు హత్యాయత్నం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles