Man Arrested For Posting obscene Video on Covid-19 కరోనాపై భయాందోళనకు గురిచేసేలా వీడియో.. అరెస్టు

Man held for posting video of him licking currency notes amid covid 19 threat

oronavirus, COVID-19, licking of currency notes, wiping nose woth currecy notes, Nashik Man, Muslim man obscene video, muslim man tictok video, Nashik rural police, cybercrime police, Malegaon, Maharashtra

A 40-year old man from Malegaon in Maharashtra has been arrested by Nashik rural police after a TikTok video that showed him wiping his nose and licking currency notes, amid the spread of coronavirus in the country.

కరోనాపై భయాందోళనకు గురిచేసేలా వీడియో.. అరెస్టు

Posted: 04/03/2020 03:56 PM IST
Man held for posting video of him licking currency notes amid covid 19 threat

కొందరు ఆకతాయిలకు కరోనా వైరస్‌ తీవ్రత అర్థం కావడం లేదు! ఈ వైరస్ పట్ల ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. ఒక్కరి వల్ల ఎందరో ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని అటు ప్రభుత్వాలు, ఇటు పోలీసులు, వైద్యధికారులు, సామాజిక కార్యకర్తలు ఎంత చెబుతున్నా వీరికి అసలు పట్టడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు, కరోనా అనే భయంకరమైన వైరస్ మూలంగా సౌదీ అరేబియాలాంటి దేశంలోనే అత్యంత పవిత్రమైన మక్కా మసీదులో కర్ప్యూను విధించాల్సిన పరిస్థితి ఏర్పడినా.. కేవలం కొందరి మాయాజాలంలో  చిక్కి.. ప్రజలను భయాందోళనకు గురిచేసే వీడియోలను సృష్టిస్తున్నారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో సయ్యద్‌ జమీల్‌ సయ్యద్‌ బాబూ (38 ఏళ్లు) కరెన్సీ నోటును జుగుప్సాకరంగా నాకుతూ, ముక్కుతో దానిపై చీదాడు. ఔషధం లేని నావెల్‌ కరోనా వైరస్‌ ‘దేవుడి శాపం’ అంటూ టిక్‌టాక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేశాడు. కరోనా వైరస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రజలను భయాందోళనకు గురిచేయడంతో ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారిపై వెకిలిగా, శాపమంటూ అందోళన చెందే విధంగా వీడియోను తీయడంతో పాటు ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ నోట్లతో అసహ్యంగా వీడియోను తీసి పోస్టు చేశాడు.

ఆ వీడియో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో మాలెగావ్‌ పరిధిలోని రంజాన్‌పుర పోలీసులు గురువారం రాత్రి సయ్యద్‌ను అరెస్టు చేశారు. ‘కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాలుస్తుందని అతడు (సయ్యద్‌) వీడియోలో అన్నాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో మేం అతడిని అరెస్టు చేశాం. మాలెగావ్ కోర్టు అతడికి ఏప్రిల్‌ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది’ అని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు అత్యవసర సర్వీస్‌కు ఫోన్‌ చేసి సమోసాలు తీసుకొస్తారా అని అడిగిన ఆకతాయితో పోలీసులు మురికి కాల్వలు, మరుగుదొడ్లు శుభ్రం చేయించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles