congress fires on TS Govt over salaries cut లాక్ డౌన్ కు సహకరిస్తాం.. కేంద్ర, రాష్ట్రాల కోతలకు కాదు: కాంగ్రెస్

Coronavirus alert pcc chief uttam kumar reddy fires on ts govt over salaries cut

coronavirus in india, coronavirus, covid-19, corona spread, CM KCR, Congress, TRS, UttamKumar Reddy, Komati Reddy Venkat Reddy, salaried cut, Employees cut, excess income state, Telangana, daily labour, chief secretaries all states, coronavirus, coronavirus lockdown 21, courts, covid19, justice nv ramana, justice ravindra bhat, migrant workers, supreme court, coronavirus updates, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus live update india, coronavirus in india new delhi, dialy labour, coronavirus in india latest news

Telangana congress says they are in of support the government during the lockdown period. they also appeal the people to be in self quarantine in theid home. But PCC president UttamKumar Reddy fires on Telangana Government over salaries cut for Employees.

లాక్ డౌన్ కు సహకరిస్తాం.. కేంద్ర, రాష్ట్రాల కోతలకు కాదు: కాంగ్రెస్

Posted: 04/01/2020 04:13 PM IST
Coronavirus alert pcc chief uttam kumar reddy fires on ts govt over salaries cut

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుననే అన్ని చర్యలకు తమ పార్టీ తరపున మద్దతుఇస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేసేందుకు ప్రజలందరూ కలసి ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఏర్పడిందని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో కలసి ప్రజలందరూ నడవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.

అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి ఓనర్లు అద్దెలు అడగవద్దని.. ప్రైవేటు పరిశ్రమలు తమ కార్మికులకు వేతనాలల్లో కోతలు విధించవద్దని అంక్షలు పెట్టిన ముఖ్యమంత్రి.. తాను చెప్పదోకటి.. చేసేది మరోకటని తేలిపోయిందన్నారు. ప్రభుత్వమే తమ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంతో.. ప్రైవేటు కార్మికుల నుంచి అన్ని వర్గాల ప్రజలపై ఈ ప్రభావం పడుతుందని.. ఇది సముచితం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు.

‘రాష్ట్రానికి వారం రోజులు రాబడి రాకుంటే వేతనాల్లో కోత విధిస్తారా?. తక్షణమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రైవేటు సంస్థలు, ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఎందుకు కోత విధిస్తోంది? రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. దాదాపు పది వేల కోట్ల రాబడి వస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న పదవీ విరమణ ఉద్యోగులకు, పెన్షనర్లకు కోత విధించడం సరికాదు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

అంతకుముందు పార్టీ సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయమై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉద్యోగుల వేతనాల్లో కొత విధించే చర్యలకు తాము వ్యతిరేకమన్నారు. ధనిక రాష్ట్రం అని చెబుతూనే.. ప్రస్తుత ఆర్థిక లోటు పేరుతో ఉద్యోగుల పొట్టమీద కొట్టడం సరైన పద్ధతికాదని.. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కేవలం 8 రోజుల లాక్ డౌన్ లో రాష్ట్రం ఆర్థిక లోటులో కూరుకుపోయిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles