Case of 'super-spreader' guru alarms India కరోనా వైరస్ తో మరణిస్తూ 27 మందికి అంటించాడు

Coronavirus update 70 year old preacher from punjab may have infected 27 people

covid-19, coronavirus, coronavirus, covid 19, coronavirus outbreak, Punjab preacher, coronavirus spread, Baldev Singh, Coronavirus update, Punjab politics

A 70-year-old religious preacher from Punjab’s Shaheed Bhagat Singh Nagar, who returned home from Germany earlier this month, has emerged as a possible super-spreader who likely infected 27 people, government officials said on Friday. The preacher or ‘granthi’, Baldev Singh, died on March 18 and is, until now, Punjab’s only Covid-19 victim.

కరోనా వైరస్ తో మరణిస్తూ 27 మందికి అంటించిన రోగి..

Posted: 03/28/2020 01:23 PM IST
Coronavirus update 70 year old preacher from punjab may have infected 27 people

పంజాబ్ లో దారుణం జరుగింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా… కరోనా వ్యాధి సోకిన తొలి బాధితుడు మరణించాడు. అయితే ఈ బాధిత వృద్దుడు తనకు సోకిన వైరస్ ను మరణానికి ముందు మరో 27 మందికి కరోనా వైరస్ ను అంటించడంతో ఆయన వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వమే స్పష్టం చేయడంతో.. కరోనా ఎంతటి మహమ్మారి వైరసోనంటూ స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంజాబ్ సిక్కుమత ప్రబోధకుడు (గ్రంధీ) బల్ దేవ్ సింగ్ ఈ నెల 18న మరణించాడు.

అయితే చనిపోయిన ఈ వ్యక్తం పంజాబ్ లోని భగత్ సింగ్ నగర్ జిల్లాలోని నవాన్ షహర్ కు చెందిన 70ఏళ్ల మత ప్రబోధకుడు బల్ దేవ్ సింగ్. ఈ కార్యక్రమంలో భాగంగా తన సహచర మత ప్రబోధకులతో కలిసి ఇటీవలే జర్మనీ, ఇటలీ దేశాల్లో పర్యటించాడు. భారత్ చేరుకోగానే అతడికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు ఇంటి దగ్గరే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అయితే బల్ దేవ్ సింగ్ అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా 15 గ్రామాల్లో తిరగడంతో పాటు.. దాదాపు 100 మందిని కలిశాడని తెలిసింది.

ఆ తర్వాత అతనికి కరోనా ముదరడంతో ఈ నెల 18న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అంతేకాదు ఇప్పుడు  ఆయన కుటుంబంలో ఏకంగా 14 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట. పంజాబ్ లో 33 కరోనా కేసులు ఉంటే… వాటిలో 23 కేసులు ఈ వ్యక్తి ద్వారానే వ్యాప్తి చెందినట్టు గుర్తించారట అధికారులు. బల్ దేవ్ తిరిగిన 15 గ్రామాలను సీజ్ చేసి… కరోనా అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారట అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  Coronavirus update  Punjab preacher  coronavirus spread  Baldev Singh  Punjab  

Other Articles