Two people test positive for COVID-19 in Andhra Pradesh తెలుగురాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు.. మొత్తం 51 మంది..

A 3 year old tested positive taking the total coronavirus cases in the state to 41

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Telangana reported two new cases of Coronavirus in the state, taking the total number of cases in the state to 41. This includes a 3-year-old child with travel history from Saudi Arabia who is the latest and youngest patient in the state.

కరోనా అలర్ట్: తెలంగాణలో 41 కేసులు.. ఏపీలో పది పాజిటివ్ కేసులు..

Posted: 03/26/2020 12:03 PM IST
A 3 year old tested positive taking the total coronavirus cases in the state to 41

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తన పంజా విసురుతోంది. తాజాగా మరో ఇద్దరు కరోనా వైరస్ వ్యాధి బారిన ఇద్దరు పడ్డారు. వీరిలో మూడేళ్ల చిన్నారి ఉండటం గమనార్హం. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 41కి చేరుకుంది. హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన బాధిత బాలుడి కుటుంబం ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చింది. ఆ వెంటనే బాలుడిలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. నిన్న బాలుడికి పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

రెండో కేసులో బాధితురాలు ఓ మహిళ. రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన ఓ వ్యక్తి (49) కొన్ని రోజుల క్రితం లండన్ నుంచి వచ్చాడు. అతడికి ఇప్పటికే వైరస్ సోకగా, తాజాగా ఆయన భార్య (43)కు కూడా వైరస్ సోకినట్టు బుధవారం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఈమెతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ రెండోదశకు గురైన కేసులు ఆరుకు చేరాయి. వీరిలో ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. కాగా, బాధితులందరూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని, వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇటు అంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన సంఖ్య తాజాగా పదికి చేరింది. అయితే కరోనా అనుమానిత లక్షణాలతో ప్రస్తుతం 117 మంది చికిత్స పొంతునన్నారని అంద్రప్రదేశ్ వైద్య అరోగ్య:శాఖ తెలిపింది. తాజాగా ఇద్దరు ఈ వ్యాధి బారిన పడటంతో ఈ సంఖ్య 8 నుంచి 10కి చేరింది. అమెరికా నుంచి విజయవాడకు చేరుకున్న ఓ 22 ఏళ్ల యువకుడికి కరోనా వ్యాధి లక్షణాలు బయటపడటంతో అతనికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ గా తేలింది. ఇక మరో కేసులో 52 ఏళ్ల వ్యక్తి న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో  జరిగిన ఓ మతసదస్సులో పాల్గొని రాగా, అతనిలోనూ కరోనా వ్యాధి లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ కేసుగా తేలింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఏపీలో పదికి చేరింది.

ఇదిలా ఉండగా...కరోనా నియంత్రణలో దేశంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో కాలుష్యం క్రమక్రమంగా తగ్గిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. తాజాగా విడుదల చేసిన వాయు నాణ్యత సూచీ ఈ మేరకు పేర్కొంది. అత్యంత అవసరమైతే తప్ప..నిత్యం తిరిగే యాబైలక్షల వాహనాల్లో వందల సంఖ్యలోనే బయటకు వస్తున్నాయి. ఈ నెల 22వ తేదీ ఆదివారం వాయు కాలుష్యం సూచీ 94 ఉండగా...2020, మార్చి 25వ తేదీ బుధవారం రోజు 60కి చేరింది. మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే..కాలుష్యం తగ్గి..పీల్చే గాలి స్వచ్చంగా మారుతుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles