BSNL Offering Free Internet To Users Working From Home బీఎస్ఎన్ఎల్ వర్క్ ఫ్రం హోం ప్లాన్

Bsnl launches work from home broadband plan for landline users

bsnl new plan,bsnl broadband plan,bsnl new broadband plan,bsnl new free broadband plan,bsnl work from home plan,bsnl free work from home plan,bsnl work from home free broadband plan,bsnl free plan,coroanvirus,coronavirus update,coronavirus news,coronavirus

Telecom company BSNL has announced Work@Home broadband plan free of cost. The plan has been announced as several offices and workplaces are being shut down due to the coronavirus outbreak and people are working from their homes.

బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్: వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వారికి ఉచితంగా డేటా

Posted: 03/20/2020 02:24 PM IST
Bsnl launches work from home broadband plan for landline users

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు చక్కటి శుభవార్తను అందించింది. ఇది వారికి గుడ్ న్యూస్ అనేకన్నా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని చప్పడం సబబు. ఇంతకీ అదెలా అంటే.. బిఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా కనెక్షన్లు తీసుకున్నవారికి నెలరోజుల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. ఇది కొత్త కనెక్షన్లు తీసుకునేవారందరికీ వర్తించినప్పటికీ.. అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ రంగ కార్మికులకు బాగా కలసివచ్చే అవకాం.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచిస్తుండగా, ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే అదేబాటలో నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆపర్ ను తీసుకువచ్చింది. తమ ఉచితంగా నెల రోజుల పాటు ఇచ్చే అంతర్జాల సర్వీసులతో తమకు మరిన్ని కొత్త కనెక్షన్లు వస్తాయని బీఎస్ఎన్ఎల్ అంచనా వేస్తోంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్రీ బ్రాడ్ బ్యాండ్ అంటూ సరికొత్త ప్లాన్ ప్రకటించింది.

ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారు కొత్తగా బ్రాండ్ బ్యాండ్ సౌకర్యం కావాలనుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ స్పందిస్తూ, తమ కొత్త ప్లాన్ తో ఉద్యోగులు ఇంటి నుంచి బయటికి రాకుండానే పని చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉన్నవారికి, కొత్తగా కనెక్షన్ తీసుకున్నవారికి ఉచితంగా ఒక నెల పాటు బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా వసూలు చేయబోమని, అయితే వినియోగదారులు ఇంటర్నెట్ మోడెమ్ ను మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bsnl  new plan  broadband plan  work from home plan  free broadband plan  coroanvirus  covid-19  

Other Articles