Kerala govt orders poultry culling after Bird flu detected తమిళనాడులో రూపాయికే చికెన్ బిర్యాని.. కేరళలో ఇలా

Amid covid 19 chicken biryani at rs 1 in tn kerala govt orders poultry culling

chicken at Rs 40, chicken @ Rs 40 per kg, coronavirus scare, covid-19 scare, coronavirus rumours, coronavirus, COVID-19, decline in sales of chicken, chicken sales, poultry markets, poultry industry, Tamil nadu, Kerala government, Bird flu, bird flu detected, bird latest news

People are swearing off chicken, worried that they might contract the dreaded coronavirus (COVID-19), Now to boos the chance sales a hotel in Tamilnadu has started chicken Biryani at Rs 1 per plate. The Kerala government ordered poultry culling after Bird flu was detected in Parappanangadi. Taking note of the situation officials have deployed squads to cull all poultries.

కరోనా భయం: రూపాయికే చికెన్ బిర్యాని .. కేరళాలో కోళ్లన్నింటినీ..

Posted: 03/14/2020 03:27 PM IST
Amid covid 19 chicken biryani at rs 1 in tn kerala govt orders poultry culling

కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వ్యాధి తాజాగా 147 దేశాలలో విలయతాండవం చేస్తోంది. అటు మనుషులపై ప్రభావం చూపుతూనే ఇటు అర్థికరంగంపై కూడా తన ప్రభావాన్ని చాటుతోంది. ఇక ప్రత్యక్షంగా నష్టపోతున్న రంగాల్లో పౌల్ట్రీ రంగం ఒకటి. ఈ వైరస్ ప్రభావంతో పల్లెలతో పాటు పట్టణాలు, నగరాల్లోనూ చికెన్ కొనుగోళ్లు పూర్తిగా పడిపోయాయి. ఎంతలా అంటే రీటైల్ వ్యాపారం మాట అటుంచితే..   హోల్ సేల్ వ్యాపారస్థులకు కూడా పూర్తిగా నష్టాలపాలు చేస్తోంది. నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్న వ్యాపారులు ఉన్నకాడికి అమ్ముకుందామని ధరలను దారుణంగా తగ్గించి విక్రయిస్తున్నారు.

అయితే, తమిళనాడులో మాత్రం ఏకంగా 100 కిలోల చికెన్ బిర్యాని గంటల వ్యవధిలో అరగించేశారు అక్కడి స్థానికులు. ఔనా.? అలా ఎందుకు.. బహుశా వారికి కరోనా భయం లేదేమోనని అంటారా.? అదేం లేదండీ.. రూపాయికి మాత్రమే అంటూ బోర్డు పెడితే.. ఈ రోజుల్లో ఏదైనా అలా అమ్మెయ్యవచ్చు అంటున్నారు. అదేంటి రూపాయికే చికెన్ బిర్యానిని అందించారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.? రూపాయికి టీ కాదు.. కనీసం వాటర్ ప్యాకెట్ కూడా రావడం లేదు. అలాంటిది చికెన్ బిర్యాని ఎలా ఇస్తారులే అంటున్నారా.? కానీ ఇక్కడ మాత్రం నిజంగానే ఇచ్చారు.

తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా వైరస్ భయాన్ని పక్కనపెట్టేసి రూపాయికే చికెన్ బిర్యానీ అనగానే లొట్టలేసుకుంటూ.. అందినంత చికెన్ బిర్యానీ లాగించారు. తిరువళ్లూర్ జిల్లాలోని పోన్నేరిలో అక్కడి స్థానికులను తమ రుచితో పాటు చక్కటి అతిధ్యంతో వ్యాపారంరంగంలోకి కొత్తగా ఓ హోటల్ వచ్చి చేరింది. నూతన ప్రారంభానికి స్థానికులను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవ అఫర్ కింద రూపాయికే చికెన్ బిర్యాని పెట్టింది. ఊరికే బోజనం పెట్టడం కన్నా.. రూపాయి బిర్యాని అంటూ ప్రచారం మొదలైతే తమకు డిమాండ్ ఏర్పడుతుందని ఈ ఐడియాను ఫాలో అయ్యింది.

ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్టు బోర్డులు పెట్టారు. అంతే.. జనాలు విరగబడిపోయారు. బిర్యానీని దక్కించుకునేందుకు బారులుతీరారు. వారిని అదుపు చేసేందుకు ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది. కరోనా భయంతో బిర్యానీ అమ్ముడుపోతుందో, లేదోనని తొలుత భయపడ్డామని, అయితే, వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడం తమకు సంతోషాన్నిచ్చిందని హోటల్ యజమాని పేర్కొన్నారు.

అటు కేరళలలో ఓవైపు కరోనావైరస్ చికెన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపితే.. మరోవైపు  బర్డ్ ఫ్లూ కేసులు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవలే కేరళలోని కొజికోడ్ లో రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించడంతో వాటి ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించడంతో వాటిని చంపేశారు. తాజాగా, ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో కోళ్లకు బ‌ర్డ్ ఫ్లూ సోకిన‌ట్లు గుర్తించారు. దీంతో ఆ కోళ్ల‌ను కూడా చంపేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి వేలాది కోళ్లు బలి కానున్నాయి. కోళ్ల‌ను చంపేందుకు ప్ర‌భుత్వ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో వైద్య సిబ్బంది కోళ్లను పరీక్షిస్తున్నారు. బ‌ర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వ‌ర‌కు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను చంపేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles