It is not in my blood to become Chief Minister, says Rajinikanth రాజకీయాల్లోకి రజనీ.. సీఎం పదవికి మాత్రం దూరం

Don t wish to be chief minister says rajinikanth as he lays out his political roadmap

rajinikanth, rajinikanth own outfir, rajinikanth political party, rajini makkal mandram, Karunanidhi, Stalin, Jayalaltiha, parneeruselvam, PalaniSwamy, RMM, DMK, AIADMK, tamil nadu, Politics

"We need a good leader. A good leader is someone who creates leaders. It is selflessness that drives me. I want a movement and a wave to come up. I believe there will be a wave to fill the leadership wave created by the death of Jayalalithaa and Karunanidhi," Tamil superstar Rajinikanth said as he laid out the ideological contours of his outfit Rajini Makkal Mandram (RMM).

రాజకీయాల్లోకి రజనీ.. సీఎం పదవికి మాత్రం దూరం

Posted: 03/12/2020 03:57 PM IST
Don t wish to be chief minister says rajinikanth as he lays out his political roadmap

తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత లేకపోవడం వల్లే తాను ప్రజల్లోకి, రాజకీయాల్లోకి వస్తున్నానని సినీనటుడు రజనీకాంత్ తెలిపారు. 2016-17లో తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించిందన్న ఆయన రాజకీయాల్లోకి.. మంచివారు  రావడం లేదని అవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని, ప్రభుత్వాలు, పార్టీలు మాత్రం నిత్యం తమ వైపునే వుండాలని ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో సమూల ప్రక్షాలన తాను చేయడానికి రాలేదన్న ఆయన వ్యవస్థను సరిచేయకుండా మార్పురావాలని కోరుకోవడం కూడా సరికాదని అన్నారు.

తనను అమితంగా అభిమానించే ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేయడమే ధ్యేయంగా చెప్పుకోచ్చారు. అయితే ఈ నేపథ్యంలో తాను కేవలం పార్టీకి అధినేతగా మాత్రమే వుంటానని చెప్పారు. తనకు పదవులపైన ఎలాంటి ఆశ లేదన్నారు. తన వయసు 68 ఏళ్లని.. ఈ వయస్సులో తనకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? అని అన్నారు. నీతి, నిజాయతీ, ప్రజల మనసులో స్థానం ఉన్నవారికే సీఎం అయ్యే అర్హత ఉందని.. అందుకనే తన పార్టీలో యువనాయక్వంలో ఆ లక్షణాలున్న వారిని ఎంచుకుని సీఎం పదవికి ఎంపిక చేస్తామని అన్నారు.

తాను పూర్తిగా పార్టీపైనే దృష్టి పెడతానని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాని చెప్పారు. అలాంటి పార్టీలు ప్రస్తుతం సమాజంలో ఎక్కడ కనిపించడం లేదని.. అందుకనే తాను రాజకీయ అరంగ్రేటం చేస్తున్నానని చెప్పారు. 1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి తాను ఆలోచించలేదని.. ఈ విషయంపై ప్రజలు తనను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పానని గుర్తుచేసుకున్నారు. కానీ రెండేళ్ల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పానని తెలిపారు. తాను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నానని.. అయితే తన అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయని వాటన్నింటికీ ఇవాళ తాను ఫుల్ స్టాప్ పెట్టానని అన్నారు.

తన పార్టీలో 60 నుంచి 65 శాతం వరకు యువతకే అవకాశమని రజనీకాంత్ చెప్పారు. అయితే రాజకీయాల్లో విద్య, వయసు కూడా ముఖ్యమేనన్న ఆయన తన పార్టీలో విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యతనిస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావం చూపుతాయని కూడా అన్నారు. అయితే తమిళనాడులోని రెండు బలమైన పార్టీలను తాను ఈ ఎన్నికల ద్వారా ఎదుర్కోబోతున్నట్లు కూడా చెప్పారు.

గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాట ప్రజలు సినీమా రంగానికి చెందినవారికి మధ్య అనుబంధం కొనసాగుతోందిని అన్నారు. ఆనాడు కరుణానిధిని చూసే డీఎంకేకు అవకాశం ఇచ్చారన్న ఆయన.. కేవలం కరుణానిధిని చూసే 70 శాతం మంది ప్రజలు డీఎంకేకు ఓటు వేశారని అన్నారు. అదే ఫార్ములాను అన్నాడీఎంకే కూడా అనుసరించింది. ఈ రెండు పార్టీలను తాను ఎదుర్కోబోతున్నాను. ఇప్పటి వరకు ఈ పరిస్థితి గతంలో వున్న పార్టీలకు ఏర్పడలేదని అన్నారు. కాగా సీఎం రజనీ అన్న నినాదలు వద్దని చెప్పిన రజనీ.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని కార్యకర్తలకు తేల్చిచెప్పారు. 2021లో ప్రజలు ఓ విప్లవంలా ప్రభుత్వాన్ని మారుస్తారని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  rajini makkal mandram  Karunanidhi  Jayalaltiha  RMM  DMK  AIADMK  tamil nadu  Politics  

Other Articles