SBI cuts interest rate on savings bank accounts ఖాతాతారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ..

Average monthly balance in sbi savings bank accounts is not required now

SBI minimum balance,state bank of india,Rajnish Kumar,Savings Account,SBI account,SBI,account, state bank of India, sbi average monthly balance, mibimum balance, savings bank account, indian economy, finance, commerce

In a major step to provide a hassle-free banking experience to customers, country’s largest lender, State Bank of India today announced the decision to waive maintenance of Average Monthly Balance (AMB) for all Savings Bank Accounts.

సేవింగ్స్ ఖాతాతారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ..

Posted: 03/11/2020 07:28 PM IST
Average monthly balance in sbi savings bank accounts is not required now

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకైన.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులకు మరో శుభవార్త చెప్పింది. పోదుపు ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్సులతో ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలను జమచేసుకుంటోందని విమర్శలను ఎదుర్కోన్న భారత అగ్రగామి బ్యాంకు.. తాజాగా ఖాతాదారుల పర్సులు కొల్లగొట్టే చర్యలకు చెక్ పెట్టింది. ఇకపై సేవింగ్స్ అకౌంట్ (పొదుపు ఖాతా)ల్లో కనీస బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఎస్బీఐ ఖాతాదారులు తమ బ్యాంకు నిలువు దోపిడికి చెక్ పడిందని సంబరపడుతున్నారు.

ఈ తరుణంలోనే మరో శుభవార్తను కూడా అందించింది ఎస్బీఐ. అంతేగాక, పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను కూడా హేతుబద్దీకరించింది. ఇకపై ఏడాది కాలానికి 3శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎస్బీఐ 2018 ఏప్రిల్‌ నుంచి కనీస బ్యాలెన్స్‌ నిబంధన తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం రూ. 5వేలు ఉంచాలని, లేదంటే పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

అయితే దీనిపై వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో గతేడాది అక్టోబరులో ఈ నిబంధనల్లో కొంత మార్పులు చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్‌ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 3వేలకు తగ్గించింది. మెట్రో, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ. 2వేలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1000 కనీస బ్యాలెన్స్ తప్పనిసరి చేసింది. అంతకుముందు రుణాలు, డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. భారత అగ్రగామి బ్యాంకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇదే భాటలో నడిచే అవకాశం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles