HC orders to remove YSRCP colours from govt buildings పది రోజుల్లోగా రంగులు మార్చి నివేదిక ఇవ్వండీ: హైకోర్టు

Ap high court issues orders to remove ysrcp colours from govt buildings

ap local bodies elections, AP Panchayat elections, High Court, YCP Flag colours, chief Secretary, YSRCP, TDP, ap panchayat election 2020, ap elections 2020, panchayat election 2020 in ap, ap panchayat election reservation list 2020, ap election commission, mptc, reservation list 2020 in ap, ap panchayat election 2020 reservation list, ap municipal elections 2020, ap state election commission, ap panchayat election 2020 date, election commission of ap, ap local body elections, mptc elections in andhra pradesh 2020, ap election, mptc reservation in ap 2020, ap local, body elections reservations, Andhra Pradesh, Politics

A big jolt to YSRCP government, Andhra Pradesh High Court issued orders to the government to remove YSRCP colours on government buildings within 10 days. According to the sources, the HC on Tuesday gave orders after hearing the petition filed by Venkasteshwar Rao, resident of Guntur district.

పది రోజుల్లోగా రంగులు మార్చి నివేదిక ఇవ్వండీ: హైకోర్టు

Posted: 03/10/2020 02:23 PM IST
Ap high court issues orders to remove ysrcp colours from govt buildings

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పంచాయితీ భవనాలకు, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలకు, ప్రభుత్వ భవనాలకు సాధారణ రంగులను మాత్రమే వేయాలని.. ప్రభుత్వాన్ని అదేశించింది హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి పది రోజుల వ్యవధిలో మళ్లీ సాధారణ రంగలు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

న్యాయస్థానం జారీ చేసిన అదేశాలను అమలు పర్చినట్లుగా రంగులు మార్చివేసిన తరువాత వాటికి ఆధారాలను కూడా చూపుతూ న్యాయస్థానంలో నివేదికను అందజేయాలని అదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీని అదేశింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సూచించింది. వైసీపీ జెండా రంగు తరహాలో రంగులు వేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. పంచాయితీ ఎన్నికలు నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వరకు అటు స్థానిక సంస్థలు ఎన్నికలన్నింటినీ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అదేశాలు జారీచేసింది.

గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్రోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, వాటర్‌ ట్యాంకులకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles