Shashi Tharoor's Theory About PM Quitting Social Media ప్రధాని ట్వీట్ పై కాంగ్రెస్ నేత భవిష్యవాణి

After pm modi s tweet makes a splash shashi tharoor s inference piques twitterati

social media ban, PM Modi quitting social media, off social media, social media detox, shashi tharoor tweet, freedom of speech, Congress MP, PM Modi, Shashi Tharoor, social media, facebook, twitter, instagram, youtube, Pan India Ban, BJP, Congress, Politics

PM Modi sent Twitterati on an overdrive when he posted a tweet in which gave the impression that he was quitting social media. Like many others, Congress leader Shashi Tharoor tweeted his view on the PM's tweet and it has also created a flutter. He hinted that PM Modi's abrupt decision may be the precursor to a pan-India social media ban.

సోషల్ మీడియాను నిషేదిస్తున్నారా.?: ప్రధాని ట్వీట్ పై కాంగ్రెస్ నేత మనోగతం..

Posted: 03/03/2020 04:33 PM IST
After pm modi s tweet makes a splash shashi tharoor s inference piques twitterati

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాను వీడారు. ఆయన ఈ యోచనలో ఉన్నప్పుడే చిట్టచివరిగా ఓ ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాలను వీడొద్దంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయితే కొందరు మాత్రం వాసనను పసిగట్టారు. త్వరలోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాపై నిషేధాన్ని విధిస్తున్నారా.? అన్న అనుమానాలు కూడా పలువురు నెటిజనులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మనం ఎంత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌.. ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటంపై ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు చేపడుతున్న ముందస్తు చర్యగా ప్రధాని నిర్ణయాన్ని అభివర్ణించారు. ‘‘ప్రధాని ఆకస్మిక నిర్ణయం దేశవ్యాప్తంగా ఆందోళనను రేకేత్తిస్తోంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు ముందస్తు చర్యగా దీన్ని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు మంచితో పాటు ఉపయోగకరమైన సందేశాలను పంచుకొనేందుకు ఒక వేదికగా ఉంటాయని ప్రధానికి కూడా తెలుసు. ఇది ద్వేషాన్ని వ్యాపింపచేయడం గురించి కాదు’’ అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌ లోక్ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురీ కూడా ప్రధాని సామాజిక మాధ్యమాలను వీడటం అనేది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న పనిగా ఆరోపించారు. రాజకీయ విమర్శకుడు, వాజ్ పేయి మాజీ సహాయకుడు సుధీంద్ర కులకర్ణి కూడా ప్రధాని ట్వీట్ పై స్పందించారు. ‘‘భారత ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కమ్యూనికేషన్ పై అతి పెద్ద దాడి. త్వరలో ప్రజాస్వామ్యంపై కూడా ఇటువంటివి జరగొచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం’’ అని ట్వీట్ చేశారు. అయితే ప్రధానిని ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్ బుక్‌లో 4.4 కోట్లు, ఇన్ స్టాగ్రాంలో 3.52 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Shashi Tharoor  social media  facebook  twitter  instagram  youtube  Pan India Ban  BJP  Congress  Politics  

Other Articles