Delhi violence, Rajya Sabha adjourned ఢిల్లీ హింసాత్మక ఘటనలపై దద్దరిల్లిన ఉభయ సభలు..

Lok sabha adjourned for the day after row on delhi violence

budget session, parliament proceedings day 2, Parliament today, lok sabha updates, rajya sabha updates, delhi riots 2020, delhi violence 2020, delhi communal violence, adhir ranjan chowdhury, parliament budget session, Opposition, TMC, AAP, Amit Shah, Amit Shah resignation, rahul gandhi, bjp congress parliament, nation, Crime

In the Lok Sabha, MPs of the Congress and the ruling BJP pushed and shoved each other over the Opposition’s insistence that Home Minister Amit Shah should resign, taking responsibility for last week’s riots in Delhi.

ఢిల్లీ హింసాత్మక ఘటనలపై దద్దరిల్లిన ఉభయ సభలు..

Posted: 03/03/2020 03:43 PM IST
Lok sabha adjourned for the day after row on delhi violence

ఢిల్లీ అల్లర్ల అంశం మరోసారి పార్లమెంటును కుదిపేసింది. ఢిల్లీ అల్లర్లపై తప్పక చర్చించాల్సిందేనన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో పలు పర్యాయాలు వాయిదా పడిన లోక్ సభ.. చివరకు గంధరగోళం మధ్య బుధవారానికి వాయిదా పడింది. నిన్న అధికార, విపక్షాల సభ్యుల మధ్య తోపులాటకు దారితీసిన పరిణామాల నేపథ్యంలో సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభా ఔనత్యాన్ని తగ్గించరాదని స్పీకర్ సూచించారు. అయినా ఢిల్లీలో రేగిన హింసాత్మక ఘటనలు, మృతులపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది.

దీంతో స్పీకర్ ఓం బిర్లా మరోమారు సీరియస్ అయ్యారు.  ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చించిద్దామన్నా విపక్ష సభ్యులు వినకపోవడంతో సభలో రసాభాసగా మారింది. విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా మండిపడ్డారు. సభా గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. అయితే ఇకపై అధికార, విపక్షాలకు చెందిన సభ్యులెవరైనా.. పోడియం దగ్గరకు దూసుకొస్తే, సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తానంటూ సీరియస్‌గా హెచ్చరించారు. ఎంపీలెవరూ ప్లకార్డులు సభలోకి తీసుకురావద్దని హెచ్చరించారు.

దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలపడంతో రచ్చ కొనసాగింది. స్పీకర్ అధికార పార్టీ పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్‌ తీరుపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. ఢిల్లీ అల్లర్లతో దేశం అశాంతి నెలకొందన్ని ఈ తరుణంలో దీనిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. ప్రజలు తీవ్ర అందోళనలోకి నెట్టివేయబడ్డారని కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అల్లర్లు విస్తరిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.

దేశంలో విద్వేషాలు చెలరేగుతున్నాయని, ఢిల్లీ మండిపోతుందని.. ఇలాంటప్పుడు సభలో చర్చించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అటు ఇప్పటివరకు ప్రభుత్వం సభలో ఎలాంటి ప్రకటన చేయలేదంటూ డీఎంకే ఎంపీ బాలు తప్పుబట్టారు. మరోపక్క ఢిల్లీ అల్లర్లపై పెద్దలసభలోను దుమారం రేగింది. రాజ్యసభ ప్రారంభంలోనే విపక్ష కాంగ్రెస్‌ నినాదాలు మొదలుపెట్టింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టింది. వెంకయ్యనాయుడు చర్చకు  అంగీకరించలేదు. సభ్యులు నినాదాలు ఆపకోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles