AAP Clean Sweeps in Delhi Elections: survey ఢిల్లీ గద్దెపై ఆఫ్.. పీపుల్స్ పల్స్ సర్వేలో క్లీన్ స్వీప్.!

People s pulse survey s says aap clean sweeps in delhi elections

Delhi election, aam aadmi party, Delhi assembly polls, elections in Delhi, Congress, assembly polls in Delhi, BJP, Arvind Kejriwal, Delhi Legislative Assembly, Delhi, Politics

The ruling AAP is all set sweep back to power in the Delhi Assembly elections, according to an Hyderabad based poll survey Peoples Pulse. AAP is likely to perform best in the outer Delhi where it is likely to score a perfect 26. It is projected to get 17 seats in central Delhi and 16 seats in the trans Delhi zone.

ఢిల్లీ గద్దెపై ఆఫ్.. పీపుల్స్ పల్స్ సర్వేలో క్లీన్ స్వీప్.!

Posted: 02/03/2020 11:49 AM IST
People s pulse survey s says aap clean sweeps in delhi elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మరోమారు అమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటుతుందని తాజా సర్వేలో వెల్లడైంది. ఈ నెల 7న ఈ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేంద్రంలోని అధికార బీజేపి పార్టీ మాత్రం ఇక్కడ గతం కన్నా మెరుగ్గా రెండో స్థానాన్ని అక్రమిస్తుందని, అయితే ఢిల్లీలోని అధికార పార్టీకి రెండో పార్టీకి మధ్య పోటీ అన్నది ఓ విధంగా లేదనే చెప్పాలని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఢిల్లీ ఫీఠాన్ని మూడు పర్యాయాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కొనసాగుతున్న సభలో ప్రతినిథ్యమే కరువైంది. కాగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కూడా ఖాతా తెరిచే అవకాశాలు వున్నాయని సర్వే సంస్థ ప్రకటించింది.

ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే గోవా తరహా రాష్ట్ర హోదాను ఇస్తామని గత ఎన్నికలకు ముందు హామీని ఇచ్చిన బీజేపి.. కేవలం రాజకీయంగానే పావులు కదుపుతుందని, ప్రజలపై పెద్దగా ప్రేమను కనబర్చడం లేదని, ఇక వారి సమస్యల పరిష్కారంలో పెద్దగా చోరవ కూడా చూపడం లేదని, దీనికి తోడు ఢిల్లీలో శాంతిభద్రలు కూడా క్షీణించడానికి బీజేపి అనుసరిస్తున్న విధానాలే కారణమని అక్కడి ఓటర్ల నాడి వుందని తెలుస్తోంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా ఓటు వేసిన ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి కేజ్రీవాల్ నాయకత్వానికే మొగ్గుచూపుతున్నారని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

గత ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ సారి కూడా కాస్తా మెజారిటీ తగ్గినా.. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మోజార్టీ సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో ఎన్నికల్లో మోదీ ఆకర్షణ, అమిత్ షా వ్యూహాలు ఎంతమాత్రమూ పనిచేయబోవని హైదరాబాద్ కు చెందిన ఈ సంస్థ సర్వే తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఢిల్లీలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.1500 నుంచి  రూ.3000 వేలకు ఆదా చేయగలుగుతోందని పేర్కొంది.  

ఢిల్లీలో విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వే తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోందని, ఎన్నార్సీ, సీఏఏలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్‌కు మారిందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ ఎన్నికలలో బీజేపి రెండో స్థానంలో కొనసాగే అవకాశాలు వున్నాయని, కాగా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలదొక్కుకునే అవకాశాలు కూడా వున్నాయని తెలిపింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో గత ఎన్నికలలో అమ్ అద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles