Firing At Delhi's Jamia University, Third In 4 Days మళ్లీ కాల్పుల కలకలం.. 4 రోజుల్లో మూడో ఘటన..

Another firing at jamia protest police have found no bullet shells or evidence

jamia firing, jamia millia university, caa, delhi, delhi police, shaheen bagh, gunman, firing at jamia, jamia university firing, jamia millia islamia, Jamia Firing, jamia millia University, Firing, Gate no 5, CAA protest, Anti CAA protest, Politics

A shot was fired outside the Jamia Millia Islamia University in south Delhi in the third such incident in four days at an anti-Citizenship (Amendment) Act (CAA) protest in the capital. Two suspects, one of them wearing a red jacket, came on a scooter and opened fire outside Gate No. 5.

ITEMVIDEOS: జామియా వర్శిటీలో మళ్లీ కాల్పులు.. 4 రోజుల్లో మూడో ఘటన..

Posted: 02/03/2020 10:52 AM IST
Another firing at jamia protest police have found no bullet shells or evidence

జామియా విశ్వవిద్యాలయం వద్ద మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు, అందోళనలు చేపట్టడుతున్న సందర్భంగా.. వారిని టార్టెగ్ చేసుకున్న అగంతకలు వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. సీఏఏ వ్యతిరేకంగా విద్యార్థులు వర్సిటీ ముందున్న రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

క్రితంరోజు అర్ధరాత్రి తర్వాత స్కూటీ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు తొలుత ఐదో నంబరు గేటు, తర్వాత ఒకటో నంబరు గేటువద్ద కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. గత గురువారం రాజఘాట్ కు ర్యాలీగా వెళ్తున్న వారిపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత రెండు రోజులకు మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా మూడో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అగంతకుల చర్యలకు నిరసనగా విద్యార్ధులు నిరనన చేపట్టారు.

ఢిల్లీలోని షాహీన్ బాగ్ కు సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు టెంట్ ఏర్పాటు చేసుకుని గత రెండు నెలలుగా సీఏఏ కు వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపట్టారు. కాగా, ఈ కాల్పుల ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ మాట్లాడుతూ కాల్పుల ఘటనలో ఏ ఒక్కరూ గాయపడలేదని తెలిపారు. కాగా, నిరసన దీక్షల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుబలగాలను మోహరించినట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి వారి వాంగ్మూలం సేకరించినట్లు తెలిపారు. ఇక ఘటనాస్థలంలో వద్దనున్న సిసీటీవీ ఫూటేజీలను కూడా పరిశీలించేందుకు మరో బృందం వెళ్లిందని తెలిపారు.

కాగా, అర్థరాత్రి వేళ కాల్పుల మోత వినిపించగానే చిన్న సమూహంగా ఏర్పడిన విద్యార్థులు అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీసిన దృశ్యాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, రంగంలోకి దిగిన జామియా నగర్ పోలీసులకు అక్కడ బులెట్ షెల్స్ లభించకపోవడం గమనార్హం. ఇదే సమయంలో అగంతకులు వచ్చిన వాహనాన్ని కొందరు ద్విచక్రంగా పేర్కొనగా, మరికొందరు దానిని నాలుగచక్రాల వాహనంగా పేర్కోన్నారు. పోలీసుల ఆధారలు లేవని చెప్పడంతో విద్యార్థులు పోలిస్ స్టేషన్ ఎదుట గుమ్మిగూడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles