Supreme Court dismisses Mukesh Singh's plea ‘నిర్భయ’ దోషి పిటీషన్ ను కోట్టివేసిన సుప్రీం

Nirbhaya case dismisses mukesh singh s plea against dismissal of mercy petition

Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

A three-judge Bench led by Justice R. Banumathi dismissed Nirbhaya case convict Mukesh’s challenge against the President’s rejection of his mercy petition, saying a quick decision by the President did not mean there was non-application of mind.

‘నిర్భయ’ దోషి ముఖేష్ సింగ్ పిటీషన్ కోట్టివేసిన సుప్రీం..

Posted: 01/29/2020 11:53 AM IST
Nirbhaya case dismisses mukesh singh s plea against dismissal of mercy petition

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషిగా తేలిన ముఖేష్ కుమార్ సింగ్.. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థాన దర్మాసనం కోట్టివేసింది. క్షమాబిక్ష పిటీషన్ ను సవాల్ చేస్తూ.. ముకేష్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కోన్న విషయాలపై స్పందిస్తూ.. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించారని స్పష్టం చేసింది. రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ తో పాటు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులన్నింటినీ కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి అందజేసిందని తెలిపింది.

దోషి ముఖేష్ సింగ్ వాదనల్లో ఎలాంటి మెరిట్ లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం క్షమాబిక్షను వేగంగా తిరస్కరించడం అంటే.. పరిశీలించకుండా తిప్పిపంపడం కాదని.. అనాలోచిత నిర్ణయం అని భావించడం అంతకన్నా తప్పని సూచించింది. అయితే జైల్లో దోషి ఎదుర్కోన్న బాధను న్యాయస్థానం అర్థం చేసుకుందని, అయినంతమాత్రన దానిని ఆదారంగా చేసుకుని క్షమాబిక్ష తిరస్కరణను సవాల్ చేయడం సముచిత చర్యకాదని పేర్కోంది. జైల్లో వేధించారన్న కారణంగా దోషి దాఖలు చేసిన రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరణ నిర్ణయాన్ని సమీక్షించలేమిన పేర్కోంది.

నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒక్కరైన ముఖేష్ కుమార్ సింగ్ రాష్ట్రపతి క్షమాబిక్ష పిటీషన్క తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం అత్యున్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఆర్‌. భానుమతి నేతృత్వంలోని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బొప్పన్నాలతో కూడాని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ జరిపింది. కాగా ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయస్థానం దోషి ముఖేష్ సింగ్ పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles