బాలీవుడ్ స్టార్ నసీరుద్దీన్ షా కుమార్తె హీబా షా.. మహిళా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ నెల 16న హీబా షా తన స్నేహితురాలుకు చెందిన రెండు పిల్లులను స్టెరిలైజేషన్(శస్త్ర చికిత్స) కోసం ముంబైలోని వెటర్నరీ క్లినిక్కు వెళ్లారు. అక్కడ పనిచేసే మహిళా సిబ్బంది ఆమెను వేచి ఉండామని చెప్పగా.. అసహనానికి గురైన హీబా ఇద్దరు మహిళా సిబ్బందిని కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడందో ఆమె అడ్డంగా దొరికి పోయారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై షీబాకు వ్యతిరేకంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. ‘నటి హీబా షా స్టెరిలైజేషన్ కోసం రెండు పిల్లులతో తమ వెటర్నరీ క్లినిక్కు వచ్చారు. పిల్లులకు స్టెరిలైజేషన్ జరిగిందని, తమ సిబ్బంది ఆమెను అయిదు నిమిషాలు వేచి ఉండామని కోరారు. రెండు మూడు నిమిషాలు వేచి ఉండి.. అంతలోనే ఆమె తమ సిబ్బందిపై దూకుడుగా ప్రవర్తించారు. నేను ఎవరో మీకు తెలియదా? ఎవరో తెలియకుండానే మీరు నన్ను ఇంతసేపు బయట వేచి ఉంచుతారా అంటూ ఆసుపత్రి మహిళా సిబ్బందిపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు.
కాగా ఈ విషయంపై స్పందించిన హీబా ఆసుపత్రి ఉద్యోగులను కొట్టినట్లు అంగీకరించారు. అయితే ముందుగా ఆసుపత్రి సిబ్బందే తనపై అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. క్లినిక్కు వెళ్లినప్పుడు తన వద్ద అపాయింట్మెంట్ ఉందని చెప్పినా కూడా వాచ్మెన్ లోపలికి అనుమతించలేదని, అనేక ప్రశ్నలు అడిగాడని తెలిపారు. లోపలికి వచ్చాక సిబ్బంది కూడా తనతో అసభ్యంగా మాట్లాడారని.. అక్కడున్న మరో మహిళ తనను ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోవాలని నెట్టేసిందని పేర్కొన్నారు. క్లినిక్కు వచ్చిన వారితో ప్రవర్తించే విధానం ఇది కాదని, మర్యాదగా మాట్లాడాలని హీబా షా సూచించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more