psycho thief: robs only female inners and cosmestics సైకో దొంగ: మహిళల లోదుస్తులు, కాస్మోటిక్స్ మాత్రమే..

Chennai police in search of a mysterious women s underclothing thief

strange thief in new colony, strange thief in chennai, strange thief in adambakkam, strange thief in tamil nadu, Clothes thief in Chennai, Women clothes thief in Chennai, chappals thief in Chennai, women chappals thief in Chennai, cosmetics thief in Chennai, women cosmetics thief in Chennai, Chennai police hunt for clothes thief, Undergarments thief, Chennai, Tamil Nadu, Crime

In an unusual instance of crime, a man has been seen stealing clothes and briefs of women residents in Chennai for the past few weeks. Police is searching for the strange thief who has only targeted women’s clothes drying on clothesline, said sources.

సైకో దొంగ: మహిళల లోదుస్తులు, కాస్మోటిక్స్ మాత్రమే..

Posted: 01/23/2020 11:03 AM IST
Chennai police in search of a mysterious women s underclothing thief

తమిళనాడు రాజధాని అడంబక్కుంలో ప్రాంతంలోని కోవైలో ఓ వింతదొంగ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సాధారణంగా దొంగలు డబ్బు దస్కం కోసం సులువుగా తమ పూట గడవటం కోసం దొంగతనాలు చేస్తుంటారే కానీ ఈ వింతదొంగ మాత్రం విచిత్రంగా మహిళలకు చెందిన లోదుస్తులు, కాస్మోటిక్స్, చెప్పులు తదితర వస్తువులను అపహరిస్తూ వున్నాడు. అంతేకాదు వాటిని ఎత్తుకెళ్లిన దొంగ వాటిని సమీపంలోనే దహనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

కోవైలోని న్యూకాలనీ పరిధిలో తుడియలూరు మీనాక్షి గార్డెన్ ప్రాంతంలో 245 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ కొద్దిరోజులుగా ఉతికి ఆరేసిన మహిళల లోదుస్తులు, చెప్పులు, కారులో పెట్టిన కాస్మోటిక్స్ కనిపించకుండా పోతున్నాయి. వరుస ఘటనలతో ఆందోళన చెందిన స్థానికులు వాటిని కుక్కలో లేక పిల్లులో ఎత్తుకెళ్లాయని, లేదా గాలికి ఎగిరపోయి వుంటాయని భావించారు. అయితే కాలనీలోని ఓ ఇంటి ఎదుట వున్న సీసీ కెమెరాలు అసలు విషయాన్ని నింపాదిగా బయటపెట్టాయి. వీటిని ఎత్తుకెళ్లింది మరోవరో కాదు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడని తెలుసుకున్నారు.

రాత్రివేళ కాళ్లకు పట్టీలు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అతను చోరీ చేసి తీసుకెళ్లిన లోదుస్తులను అదే ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద దాచడం, వాటిలో కొన్నింటిని అక్కడే నిప్పంటించి దహనం చేసినట్లు గుర్తించారు. అతడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలీక స్థానికులు ఆందోళ చెందుతున్నారు. అతడి ప్రవర్తన మరింత ముదిరి మహిళలపై ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడతాడా? అని భయపడుతున్నారు. ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles