Fire breaks out at tyre godown in Hyderabad భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. కమ్ముకున్న పొగ

Fire breaks out at tyre godown in rajendranagar of hyderabad

fire accident in plastic godown, fire accident in danimma area, fire accident in Rajendranagar, fire accident in Hyderabad, fire tenders rush to danimma area, Plastic godown, danimma area, fire accident, Mailardevpally police station, Rajendranagar, fire tenders, Hyderabad, Telangana, Crime

A massive fire broke out at a tyre godown at Rajendranagar under Mailardevpally police station limits. The fire spread to the nearby plastic godown. The flames from the two godowns formed a thick smoke which caused suffocation to the people residing in the area. The fire officials who arrived the spot in five fire fighting vehicles are struggling to put out the fire.

భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. కమ్ముకున్న పొగ

Posted: 01/23/2020 10:16 AM IST
Fire breaks out at tyre godown in rajendranagar of hyderabad

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనవాసాల మధ్య ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక దళాలు స్థానికులను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టారు. దీనికి తోడు టైర్ల గొదాములో ఎగసిన మంటలు దాని పక్కనే అనుకుని వున్న ప్లాస్టిక్ గోదాముకు కూడా వ్యాపించడంతో దట్టమైన నల్లని పొగ ఆ ప్రాంతానంతా కమ్మెసింది. దీంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నారు.

ఈ ఘటనకు నగర శివార్లలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ లోని దానిమ్మ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా వున్న టైర్ల గొదాములో అకస్మికంగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా ఆ గోదాముకు అనుకుని వున్న ప్లాస్టిక్ గోడౌన్ కూడా వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్లాస్టిక్ సహా టైర్ల దగ్దం కావడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జనవాసాలుండే ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈ గోదాములు ఏర్పాటు చేశారని స్థానికులు అరోపిస్తున్నారు. కాగా నివాస ప్రాంతాల్లో ఇలాంటి అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్లాస్టిక్ గోడౌన్ నుంచి దట్టమైన పొగలు దాదాపు కిలోమీటరు వరకు వ్యాపించాయి. నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం పోంచివుండటంతో అప్రమత్తమైన పోలీసులు స్థానికులను ఇళ్ల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రాణనష్టం లేకుండా చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. ఐదు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకోచ్చారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు పూర్తైన తరువాత కానీ చెప్పలేమని అధికారులు చెప్పారు. కాగా ప్రాథమిక సమాచారం మాత్రం షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక జనవాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా గోదాములు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కొందరు పెద్దల అండదండలతో దీన్ని అక్రమంగా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles