Amala Paul Father Passes Away హీరోయిన్ అమలాపాల్ కు పితృ వియోగం

Actress amala paul father passes away

Amala Paul, father of actress, Paul Varghese, Kuruppampady, Annice Paul, Abhijith Paul, St Paul’s Church, last rites, Kollywood, mollywood, Entertainment, Movies, Tollywood

Paul Varghese, father of actress Amala Paul died on Tuesday. He was 61. The last rites will be performed at the St Peter and St Paul’s Church in Kuruppampady. He is survived by wife Annice Paul, children Amala Paul and Abhijith Paul.

హీరోయిన్ అమలాపాల్ కు పితృ వియోగం

Posted: 01/22/2020 03:28 PM IST
Actress amala paul father passes away

హీరోయిన్‌ అమలాపాల్‌ ఇంట పెను విషాదం అలుముకుంది. అమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచ్చిలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించారు. ఆయనను సజీవంగా వుంచేందుకు వైద్యులు ఎంతో శ్రమించినా.. ఆయన శరీరం స్పందించకపోవడంతో కన్నుమూశారు. ఆయన పరమపదించిన వార్త తెలిసిన అమలాపాల్ హుటాహుటిన కొచ్చికి చేరకుని తన తండ్రి బౌతికఖాయం వద్ద కూర్చోని కన్నీళ్ల పర్యంతమవుతూనే.. తన తల్లిని ఓదార్చారు.

తన తాజా చిత్రం ‘అదో అంద పరవై పోల’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందుకోసం అమె సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు చెన్నై విచ్చేసింది. ఈ సమయంలో తన తండ్రి మృతి చెందారన్న విషయాన్ని అమె వ్యక్తిగత సహాయకుడు సమాచారం అందించడంతో.. అమె  హుటాహుటిన కేరళలోని తన స్వస్థలానికి పయనమైంది. అప్పటికే దు:ఖసాగరంలో మునిగిన తల్లిని ఓదార్చింది. కేరళలోని కురుప్పంపాడిలోని సెయింట్‌ పౌల్‌ క్యాథలిక్‌ చర్చిలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పాల్ వర్గీస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక అమలాపాల్‌ సినిమాల్లోకి రావటం ఆమె తండ్రికి అస్సలు నచ్చేది కాదట. కానీ కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని ఒప్పించడంతో అమల సినిమాల్లో నటించేందుకు అడ్డు చెప్పలేదట. అలా అమల ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇటీవల అమె నటించిన అమె చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Paul Varghese  father no more  last rites  Annice Paul  Abhijith Paul  Mollywood  Tollywood  

Other Articles