Shirdi closed from Jan 19th amid birthplace controversy షిరిడి ఆలయానికి తాళం వార్తలపై ‘సంస్థాన్’ క్లారిటీ

Shirdi to remain shut from jan 19th after cm s remark on sai baba s birthplace

Shirdi, Maharashtra Shirdi, Uddhav Thackeray, Uddhav Thackeray maharashtra, Thackeray Shirdi, Thackeray Pathri, Pathri in Parbhani, Maharashtra, Politics

A call has been given for indefinite closure of Shirdi after Maharashtra Chief Minister Uddhav Thackeray's reported comment terming Pathri in Parbhani as Sai Baba's birthplace. Saibaba Sansthan Trust Member Wakchaure said that sansthan announced to close Shirdi Temple from Jan 19th.

షిరిడి ఆలయానికి తాళం వార్తలపై ‘సంస్థాన్’ క్లారిటీ

Posted: 01/18/2020 11:32 AM IST
Shirdi to remain shut from jan 19th after cm s remark on sai baba s birthplace

సబ్ కా మాలిక్ ఏక్ అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పిన షిరిడీ సాయినాథుడి ఆలయానికి తాళాలు పడుతున్నాయన్న వార్త ఇప్పుడు ఆయన భక్తుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. షిరిడీసాయినాధుడి దర్శనం కోసం మూడు నాలుగు నెలల ముందునుంచే ఏర్పాట్లు చేసుకునే భక్తులతో అరకొరగా వున్న రైలు సర్వీసులన్నీ పూర్తిగా రిజర్వు చేయబడ్డాయి. ఇక అటు విమానంలో ఇటు బస్సుల్లోనూ భక్తులు షిరిడీకి చేరకుని సాయినాధుడి ద్వారకామాయికి చేరుకుంటారు. అక్కడ సమాధిలో సాయిని దర్శించుకుంటారు.

అయితే సంస్థానంతో పాటు షిరిడి పురజనులు కూడా ఏకమై ఆలయానికి తాళాలు వేస్తామని ప్రకటించారని వార్తలు వినిపిస్తున్నాయి. షిరిడీలో సాయిబాబు స్వయంగా సమాధి అయిన పుణ్యధామ ప్రాశిత్యాన్ని, ఐతిహ్యాన్ని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. అరోపిస్తూ షిరిడి పురజనులు ఈ నిర్ణయం తీసుకున్నారు. షిరిడీసాయి సంస్థాన్ ఆధ్వర్యంలో ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్లు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు భావూ సాహేబ్, వాక్చూరే లు కూడా ధృవీకరించారు.

ఇదివరకే షిరిడీ సాయినాధుడి దర్శనానికి అన్ని ఏర్పట్లు చేసుకున్న భక్తులు తమ ప్రయాణాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. షిరిడికి చేరకుని సాయినాధుడ్ని దర్శించుకోవాలా.? లేక తమ టికెట్లను రద్దు చేసుకోవాలా అన్న విషయం అర్థంకాక డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక దీనికి తోడు షిరిడీ గ్రామంలో బంద్ ప్రకటిస్తున్నామని గ్రామస్థులు కూడా నిర్ణయం తీసుకోనున్నారన్న వార్తల నేపథ్యంలో ఏమి చేయాలో తెలియక ఆ సాయినాధుడిపైనే భక్తులు భారం వేస్తున్నారు. షిరిడీ సాయే తమకు మార్గం చూపుతాడని విశ్వసిస్తున్నారు.

కాగా భక్తుల కోసం షిరిడీలోని సాయిబాబా ఆలయం తెరచేవుంటుందని తాజాగా షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. ఆదివారం నుంచి శిరిడీ ఆలయం మూసివేయనున్నారని జాతీయా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ‘సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌’ స్పందించింది. బంద్‌ కేవలం షిరిడీ సహా చుట్టుపక్క గ్రామాలకే పరిమితమని స్పష్టం చేసింది. గ్రామస్థుల బంద్‌తో ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గ్రామస్థులు ఇచ్చిన బంద్‌ పిలుపుపై వారితో చర్చించబోతున్నామని ట్రస్ట్‌ అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. 

అసలు ఎందుకిలా జరుగుతోందంటే..

షిరిడీలో కొలువైన సాయిబాబా జన్మ స్థలంపై వివాదం నెలకొంది. ఆయన జన్మించినది పర్భనీలోని పథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం మొదలైంది. పథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. షిరిడీతో సమానంగా పథ్రీని కూడా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీంతో షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు అగ్గిమీద గుగ్గిలమైంది. సాయి సమాధైన షిరిడీ ప్రాశత్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడింది.

పథ్రీ అభివృద్దికి రూ.100 కోట్లు కేటాయించిన పక్షంలో.. రవాణా మార్గం మెరుగ్గా వున్న పథ్రీకే భక్తులు ఎక్కువగా వెళ్లే అవకాశం వుందని.. అక్కడికి వెళ్లిన భక్తులు షిరిడీకి చేరుకునే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని షిరిడీ సంస్థాన్ అందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు షిరిడీ గ్రామస్థులతో సమావేశం కానుంది. ఇవాళ షిరిడీసాయి దర్శనానికి భక్తులను అనుమతించిన పిమ్మట అదివారం నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది. అంతేకాదు బంద్ కు కూడా పిలుపునిచ్చింది.

సాయి జన్మస్థలం పథ్రి.. షిరిడీలో సమాధి..

పర్బణి జిల్లాలోని పథ్రీ అనే ఊరే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. శిరిడీకి ఇది 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయి షిరిడీకి వచ్చారని, ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు చెబుతుంటారు. అయితే సాయి జన్మించిన స్థలం మాత్రం పథ్రీ అని భక్తుల విశ్వాసం. కాగా సాయి తన కోరికమేరకు శ్రీకృష్ణ భగవాన్ కోసం నిర్మించిన ఆలయంలో ఆయన సమాధి అయ్యారన్నది షిరిడీ సాయి భక్తులకు తెలిసిన విషయం. కాగా, షిరిడీ సాయి జన్మస్థలం విషయంలో తెరపైకి వచ్చిన తాజా వివాదంతో భక్తుల్లో అయోమయం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles