రెక్కాడితేనేగానీ డొక్కాడని హైదరాబాద్ కు చెందిన దినసరి కూలీ రూ.కోటి జరిమానాను కట్టాలని నోటీసులు జారీ చేసిన అదాయపన్ను శాఖ ఘనతను విన్న తరుణంలో అలాంటిదే మరో ఘటన కూడా చోటుచేసుకుంది. అయితే ఈ సారి కాల్ సెంటర్ ఉద్యోగికి ఈ నోటీసులు అందాయి. వేల రూపాయల జీతం వున్నా ఆదాయపన్ను పరిధిలోకి కూడా రానీ ఉద్యోగికి పెనాల్టీ కట్టాల్సిందిగా ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రావడంతో నివ్వెరపోవడం అతని వంతు అయ్యింది.
హైదరాబాద్కు చెందిన బావ్ సాహెబ్ అహీర్ బతుకుదెరువు కోసం కొనాళ్ల క్రితం ముంబయికి వెళ్లి దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేశారని... దానికి పాన్ నెంబరు జత చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ. 1.05 కోట్లు పన్ను కట్టాలని నోటీసులు పంపారు. కాగా తనకు బ్యాంకు ఖాతానే లేదని అహీర్ వాదిస్తుండడం గమనార్హం. సరిగ్గా ఇలానే ఐటీ శాఖ నుంచి రూ.3.49 కోట్లు మేర ఓ నోటీసు అందుకున్న కాల్ సెంటర్ ఉద్యోగి షాక్ అవుతున్నాడు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన రవి గుప్తా అనే వ్యక్తి పంజాబ్ లో ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యతరగతి వర్గానికి చెందిన రవిగుప్తాకు కొన్నిరోజుల క్రితం ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు వచ్చాయి. ఈ నోటీసుల సారాంశంలోకి ఎంట్రీ ఇస్తే.. 2011-12 ఏడాదిలో రవిగుప్తాకు చెందిన పాన్ నెంబర్ పై రూ.1.32 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపారని, అందుకు రూ.3.49 కోట్లు జరిమానా చెల్లించాలన్నది ఆ నోటీసులలో ఆదాయ పన్నుశాఖ అధికారులు పేర్కోన్నారు.
అయితే ఈ నోటీసులు వెనుక అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకున్న రవిగుప్తా.. ఈ లావాదేవీలు తాను జరపలేదని లబోదిబోమన్నాడు. నోటీసులలో పొందుపర్చిన పాన్ నెంబర్ తనదే కానీ లావాదేవీలు మాత్రం తాను జరపలేదని అన్నారు. ఇతరులెవరో తన పాన్ నెంబర్ ఆధారంగా లావాదేవీలు జరిపినట్టు గుర్తించాడు. ముంబయిలోని ఓ వజ్రాల సంస్థ తన పాన్ నెంబర్ ను అక్రమంగా ఉపయోగించుకుందని తెలుసుకున్నాడు. కొన్ని లావాదేవీలు జరిపి ఆపై ఖాతా తొలగించారని, అసలు వాళ్లెవరో తనకు తెలియదని రవి గుప్తా మొత్తుకుంటున్నాడు.
అయితే తాను ఐటీ నోటీసులు పొందిన సమయం నుంచి తాను స్వయంగా రంగంలోకి దిగి చేధించిన వివరాల ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి ముఖుల్ చోక్సీ, అతని అల్లుడు నిరవ్ మోదీలే తన పాన్ నెంబర్ వెనుకనున్న సూత్రదారులని గుర్తించాడు. ఎందుకంటే వారి కార్యాలయాల పక్కనే తప్పుడు ఫ్యాన్ అధారంగా తెరచిన వ్యాపారాన్ని కోనసాగించిన కార్యాలయం వుంది. ఇక ఈ పూర్తి వ్యవహారంపై ఆయన మధ్యప్రదేశ్ డీజీపీకి, మహారాష్ట్ర పోలీసు శాఖ పోర్టల్ ద్వారా అధికారులకు తన అవేదనతో లేఖలను మెయిల్ చేశానని రవిగుప్తా తెలిపాడు. ఆదాయపన్ను అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more