BPO employee slapped Rs 3.49 crore IT notice ఏడు వేల జీతగాడికి.. రూ.3.5 కోట్ల ఐటీ నోటీసు.!

Man earning 7 000 gets notice to explain 134 cr transaction

Income Tax, Ravi Gupta, IT Department, money laundering, Mehul Choksi, call center employee, Rs 3.5 cr penalty, income tax notice, RBI, Account transaction, banking fraud, Maharashtra police, ITR filing, Madhya Pradesh police

Ravi Gupta 29 from Bhind district of Madhya Pradesh was taken aback after being handed over an income tax notice, asking him to explain transactions of ₹134 Crore made on a business account opened with his PAN number in Mumbai in 2011-2012.

ఏడు వేల జీతగాడికి.. రూ.3.5 కోట్ల ఐటీ నోటీసు.!

Posted: 01/17/2020 12:33 PM IST
Man earning 7 000 gets notice to explain 134 cr transaction

రెక్కాడితేనేగానీ డొక్కాడని హైదరాబాద్ కు చెందిన దినసరి కూలీ రూ.కోటి జరిమానాను కట్టాలని నోటీసులు జారీ చేసిన అదాయపన్ను శాఖ ఘనతను విన్న తరుణంలో అలాంటిదే మరో ఘటన కూడా చోటుచేసుకుంది. అయితే ఈ సారి కాల్ సెంటర్ ఉద్యోగికి ఈ నోటీసులు అందాయి. వేల రూపాయల జీతం వున్నా ఆదాయపన్ను పరిధిలోకి కూడా రానీ ఉద్యోగికి పెనాల్టీ కట్టాల్సిందిగా ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రావడంతో నివ్వెరపోవడం అతని వంతు అయ్యింది.

హైదరాబాద్‌కు చెందిన బావ్ సాహెబ్ అహీర్ బతుకుదెరువు కోసం కొనాళ్ల క్రితం ముంబయికి వెళ్లి దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. పెద్ద నోట్ల రద్దు సమయంలో అహీర్ బ్యాంకు ఖాతాలో రూ.58 లక్షలు డిపాజిట్ చేశారని... దానికి పాన్ నెంబరు జత చేయకపోవడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ. 1.05 కోట్లు పన్ను కట్టాలని నోటీసులు పంపారు. కాగా తనకు బ్యాంకు ఖాతానే లేదని అహీర్ వాదిస్తుండడం గమనార్హం. సరిగ్గా ఇలానే ఐటీ శాఖ నుంచి రూ.3.49 కోట్లు మేర ఓ నోటీసు అందుకున్న కాల్ సెంటర్ ఉద్యోగి షాక్ అవుతున్నాడు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన రవి గుప్తా అనే వ్యక్తి పంజాబ్ లో ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యతరగతి వర్గానికి చెందిన రవిగుప్తాకు కొన్నిరోజుల క్రితం ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు వచ్చాయి. ఈ నోటీసుల సారాంశంలోకి ఎంట్రీ ఇస్తే.. 2011-12 ఏడాదిలో రవిగుప్తాకు చెందిన పాన్ నెంబర్ పై రూ.1.32 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపారని, అందుకు రూ.3.49 కోట్లు జరిమానా చెల్లించాలన్నది ఆ నోటీసులలో ఆదాయ పన్నుశాఖ అధికారులు పేర్కోన్నారు.

అయితే ఈ నోటీసులు వెనుక అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకున్న రవిగుప్తా.. ఈ లావాదేవీలు తాను జరపలేదని లబోదిబోమన్నాడు. నోటీసులలో పొందుపర్చిన పాన్ నెంబర్ తనదే కానీ లావాదేవీలు మాత్రం తాను జరపలేదని అన్నారు. ఇతరులెవరో తన పాన్ నెంబర్ ఆధారంగా లావాదేవీలు జరిపినట్టు గుర్తించాడు. ముంబయిలోని ఓ వజ్రాల సంస్థ తన పాన్ నెంబర్ ను అక్రమంగా ఉపయోగించుకుందని తెలుసుకున్నాడు. కొన్ని లావాదేవీలు జరిపి ఆపై ఖాతా తొలగించారని, అసలు వాళ్లెవరో తనకు తెలియదని రవి గుప్తా మొత్తుకుంటున్నాడు.

అయితే తాను ఐటీ నోటీసులు పొందిన సమయం నుంచి తాను స్వయంగా రంగంలోకి దిగి చేధించిన వివరాల ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి ముఖుల్ చోక్సీ, అతని అల్లుడు నిరవ్ మోదీలే తన పాన్ నెంబర్ వెనుకనున్న సూత్రదారులని గుర్తించాడు. ఎందుకంటే వారి కార్యాలయాల పక్కనే తప్పుడు ఫ్యాన్ అధారంగా తెరచిన వ్యాపారాన్ని కోనసాగించిన కార్యాలయం వుంది. ఇక ఈ పూర్తి వ్యవహారంపై ఆయన మధ్యప్రదేశ్ డీజీపీకి, మహారాష్ట్ర పోలీసు శాఖ పోర్టల్ ద్వారా అధికారులకు తన అవేదనతో లేఖలను మెయిల్ చేశానని రవిగుప్తా తెలిపాడు. ఆదాయపన్ను అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles