Nirbhaya convicts will hang on February 1 ‘నిర్భయ’ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6.గంటలకు ఉరి

Nirbhaya case convicts to face the gallows on february 1 at 6 am

mercy plea, Prakash Javadekar, patiyala court, AAP, Arvind Kejriwal Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

A Delhi court on Friday issued fresh death warrants against four convicts in the 2012 Nirbhaya gangrape and murder case. The convicts will now be hanged on February 1 at 6 am.

ఇదే ఫైనల్: ‘నిర్భయ’ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ఉరి

Posted: 01/17/2020 11:35 AM IST
Nirbhaya case convicts to face the gallows on february 1 at 6 am

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరి తీయాలని ఆదేశిస్తూ ఢిల్లీలోని పాటియాల కోర్టు తాజాగా మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ తిరస్కరించారు. దీంతో తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడంతో ఇక ఇదే నిర్భయ దోషులకు ఫైనల్ జడ్జ్ మెంట్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

క్షమాబిక్ష పిటీషన్ తిరస్కారం నేపథ్యంలో తాజా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ తిహార్ జైలు అధికారులు ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని తిహార్ అధికారుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ కొట్టివేత గురించి దోషి ముఖేశ్ కు సమాచారమిచ్చేందుకు కోర్టు జైలు అధికారులకు సాయంత్రం 4.30 గంటల వరకు సమయమిచ్చింది. దీంతో అధికారులు ముఖేశ్‌కు అధికారికంగా సమాచారమిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసింది.

నిర్భయ దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలుపై ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు స్టే జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 22న దేశరాజధానిలో దారుణ సామూహిక హత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ సింగ్‌, వినయ్‌ శర్మలను ఉరితీయాల్సి వుంది. అయితే దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ కు, రాష్ట్రపతికి అర్జీలు పెట్టుకున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వెంటనే దానిని తిరస్కరించి ఢిల్లీ రాష్ట్రప్రభుత్వానికి పంపారు. ఢిల్లీ సర్కారు కూడా వెంటనే దానిని కేంద్ర హోంశాఖకు పంపింది.

అయితే రూల్‌ ప్రకారం... హోంశాఖ పంపే సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. కానీ ముఖేశ్‌ సింగ్‌ ఈలోగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలుచేసి తనకు ప్రత్యేకకోర్టు జారీ చేసిన డెత్‌ వారెంట్‌ అమలు చేయరాదని వాదించారు. కానీ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పి ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ముఖేశ్‌ సింగ్‌ తరఫు న్యాయవాదులు మళ్లీ పటియాలా హౌస్ లోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం వారి పిటీషన్ ను పరిశీలించింది. దీంతో న్యాయమూర్తి డెత్ వారెంట్ ఉత్తర్వులను వాయిదా వేస్తూ స్టే విధించారు.
 
తాను జారీచేసిన డెత్‌ వారెంటును సమీక్షించబోవడం లేదని.. క్షమాభిక్ష పిటిషన్‌ పరిశీలనలో ఉన్నందున ఉరి అమలుపై స్టే ఇస్తున్నానంతేనని న్యాయమూర్తి ఈ సందర్భంగా వెలువరించారు. ఈ నెల 22న దోషుల్ని ఉరి తీయడం లేదని తిహార్‌ జైలు అధికారులు నివేదిక ఇస్తున్నట్లు జడ్జి సతీశ్‌ అరోరా స్పష్టం చేశారు. అంతేకాక డెత్‌ వారెంట్‌ అమలుకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకూ వచ్చాయన్న విషయమై కూడా నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. 22న డెత్‌ వారెంట్‌ అమలు అసాధ్యమని, కొత్త తేదీ ఇవ్వాలని తిహార్‌ జైలు అధికారులు కోర్టును కోరారు.
 
తన క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నందున 22న ఉరి తీయాలన్న డెత్ వారెంట్‌ చెల్లదని దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టులో వాదించారు. ‘‘జైలు నిబంధనల ప్రకారం ఒక కేసులో ఒకరి కంటే ఎక్కువమందికి మరణశిక్ష విధించినపుడు.. ఆ దోషుల్లో ఒకరు క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకుంటే.. ఆ దోషులందరి శిక్ష అమలు నిలిపివేయాలి. ఈ కేసులో ముఖేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష తేలేదాకా మిగిలిన వారినీ ఉరితీయరాదు’’ అని అతని తరఫు న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ పేర్కొన్నారు. అలాగని క్షమాభిక్షను తిరస్కరించిన మరుక్షణం ఉరితీయకూడదని కూడా అమె న్యాయస్థానానికి విన్నవించారు.
 
తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అందోళనను వ్యక్తం చేశారు. న్యాయం జరగడంలో ఇంకా తమ బిడ్డకు అన్యాయం జరుగుతోందని అమె అభిప్రాయపడ్డారు. తాజా పరిణామాలను చూస్తుంటే తమ బిడ్డ హత్యాచార కేసులో న్యాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు శిక్ష వేస్తున్నట్లు వుందని అమె అభిప్రాయపడ్డారు. తమకు ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ సాయపడుతున్నట్లు అనిపించడం లేదన్నారు. న్యాయపరంగా ఉన్న లొసుగుల్ని వాడుకుంటూ దోషులు తాత్సారం చేస్తున్నారని కోర్టు తీర్పు వెలువడ్డాక ఆమె దుమ్మెత్తిపోశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya  Murder  Rape  convicts  Tihar jail  mercy plea  new execution date  patiyala court  Delhi government  crime  

Other Articles

Today on Telugu Wishesh