Mumbai-Bhubaneswar LTT Express Derails In Cuttack పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్.. 40 మందికి గాయాలు

8 bogies of mumbai bhubaneswar ltt express derail at least 40 injured

odisha train accident, cuttack train accident, lokmanya tilak, train accident today, lokmanya tilak train, lokmanya tilak express, ltt express, 12879, mumbai to bhubaneswar train, mumbai to bhubaneswar, lokmanya tilak express route, odisha train, mumbai bhubaneswar train, Odisha, Crime

Several people have reportedly been injured as eight bogies of Mumbai-Bhubaneswar Lokmanya Tilak Terminus (LTT) Express derailed near Cuttack in Odisha. Chief Public Relation Officer (CPRO), East Coast Railway said 20 people have suffered injuries in the accident.

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్ ప్రెస్.. 40 మందికి గాయాలు

Posted: 01/16/2020 10:44 AM IST
8 bogies of mumbai bhubaneswar ltt express derail at least 40 injured

ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న లోకమాన్య తిలక్ (ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్‌ కటక్‌ సమీపంలోని నిర్గుండి పట్టాలు తప్పింది. వేగంగా వెళ్తున్న రైలు ఒడిశాలోని కటక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాలాగాం, నిర్గూండీ రైల్వే స్టేషన్ల మధ్యలో వెనక నుంచి గూడ్స్‌ రైలును ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. ఎల్టీటీ ఎక్స్  ప్రెస్ రైలుకు చెందిన సుమారు 8 బోగీలు ఈ ప్రమాదంలో పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా న్నట్లు సమాచారం. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం కోసం రైల్వే మెడికల్ రైలు ఘటనాస్థలానికి చేరుకుంది. కాగా, పలు అంబులెన్స్ లలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కటక్ లోని ఎస్సీబి మెడికల్ కలాలేజ్ అసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం కారణంగా ఈ రూట్ లో ఐదు రైళ్లను దారిమళ్లించారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ మార్గంలో దట్టంగా అలుముకున్న పోగమంచు ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రమాదానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు 1072 నెంబరును వినియోగంలోకి తీసుకువచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lokmanya tilak  LTT Express  train accident  mumbai  bhubaneswar  cuttack  Odisha  Crime  

Other Articles