Ukrainian airplane crashes near Tehran ఇరాన్ లో కుప్పకూలిన విమానం.. 180 మంది మృతి

Ukraine international airlines boeing 737 800 crashes in tehran

Boeing737, UIA737Crash, Ukraine International Airlines, Tehran, Kyiv Boryspil, Imam Khomeini International Airport, Iran's state television, America, Crime

Breaking news coming out of Tehran as a Ukraine International Airlines Boeing 737-800 has crashed shortly after takeoff. Flight 752 was bound for Kyiv Boryspil when the aircraft went down near Tehran’s Imam Khomeini International Airport.

ITEMVIDEOS: ఇరాన్ లో కుప్పకూలిన ఉక్రెయిన్ విమానం.. 180 మంది మృతి

Posted: 01/08/2020 10:55 AM IST
Ukraine international airlines boeing 737 800 crashes in tehran

ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టెహ్రాన్ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 170 మంది ప్రయాణికులతో పాటు 10 మంది విమానయాన సిబ్బంది అంతా అసువులు బాసారు. ఈ మేరకు ఇరాన్ అధికార టెలివిజన్ బ్రేకింగ్ న్యూస్ ను ప్రసారం చేస్తోంది. తెహ్రాన్ నగరశివార్లలో ఈ ఘటన చోటుచేసుకోగా, విమానం కొద్ది సేపు గాల్లోనే మంటలతో తిరిగింది. మంటలను అదుపు చేయడం అసాధ్యకావడంతో ఫైలెట్లు కూడా నియంత్రణ కోల్పోయారు. దీంతో విమానం తెహ్రాన్ శివార్లలోనే కుప్పకూలగా, అందులో ప్రయాణిస్తున్న 180 మంది అగ్నికి అహుతయ్యారు.

ఇరాన్ లోని తెహ్రాన్ సమీపంలోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాప్ అయిన కొద్దిసేవటికే రాడర్ నుంచి సమాచారం కోల్పోయింది. దీంతో ముందుగా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయని భావించిగా.. ప్రయాణికులు బంధువుల అనుమానాలను నిజం చేస్తూ విమానం కుప్పకూలిపోయింది. ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కైవ్ కు 29 కిలోమీటర్ల దూరంలోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలడంతో పెను విషాదం చోటుచేసుకుంది.

బోయింగ్ 737-800 విమానం ఈ తెల్లవారుజామున 5.15 నిమిషాలకు బయలుదేరాల్సి వుండగా, గంట ఆలస్యంగా 6.12 నిమిషాలకు బయలుదేరింది. అయితే సాంకేతిక లోపం కారణంగానే ఆలస్యంగా బయలుదేరిందా.? అన్న సందేహాలు కూడా వున్నాయి. ఇంతలో విమానం కుప్పకూలిందన్న వార్తల నేపథ్యంలో అందుకు కూడా ఇదే కారణమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాగా ఈ విమానాన్ని అమెరికానే కూల్చి వేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటోందని, ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది.

ఉక్రెయిన్ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని, తమ రాడార్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు. మరింత సమాచారం వెలువడాల్సి వుంది. తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన అనంతరం అమెరికా స్పందించింది. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ గగనతలం మీదుగా యూఎస్ విమానయాన సంస్థల విమానాలేవీ ప్రయాణించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇరాన్, సౌదీ అరేబియా సముద్ర జలాలపైనా ప్రయాణాలు సాగించవద్దని ఆదేశించింది. కాగా, ఇరాక్ లోని రెండు అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్ లపై ఇరాన్ 12 మిసైళ్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్ గా తీసుకున్న ట్రంప్, ఇరాన్ తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఈ ఉదయం టెహ్రాన్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles