MLA Roja Gheored by YCP party activists in puthur పార్టీ కార్యకర్తల చేతిలో ఎమ్మెల్యే రోజాకు పరాభవం..

Ysrcp roja s convoy blocked by party supporters in andhra pradesh

APIIC Chairman, YSRCP legislator, RK Roja, Nagari Constituency, party sympathisers, Gheoraed, Andhra pradesh, Politics

The convoy of APIIC Chairman and YSRCP legislator from Nagari RK Roja, was briefly blocked on Sunday evening allegedly by sympathisers of her own party. The YSRCP supporters said that they were upset and felt that they were being sidelined and ignored.

సొంతపార్టీ కార్యకర్తల చేతిలో ఎమ్మెల్యే రోజాకు పరాభవం.. కేసు నమోదు

Posted: 01/06/2020 01:37 PM IST
Ysrcp roja s convoy blocked by party supporters in andhra pradesh

తమ సొంతపార్టీ కార్యకర్తల చేతిలో నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మెన్ ఆర్కే రోజాకు పరాభవం ఎదురైంది. అమె వెళ్తున్న కారును నిలిపి సమస్యలను చెప్పేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను పార్టీ నాయకులు అడ్డుకోవడంతో వారంతా అగ్రహానికి గురై అమె వెళ్తున్న కారును ఘెరావ్ చేశారు. కారును ముందుకు కదలనీయకుండా చుట్టుముట్టారు. ఈ క్రమంలో కొందరు అమెపై విమర్శలు చేశారు. ఎన్నికల ముగిసాయి కాబట్టి తమను పట్టించుకోవడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టగా.. అమె అక్కడి నుంచి వెళ్లారు.

కాగా, రోజా అనుచరులు ఆమెను అడ్డగించిన కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్ పురంలో చోటుచేసుకుంది. రోజాను రానివ్వకుండా నిన్న సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ నాయకులను పట్టించుకోకుండా టీడీపీ నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పుత్తూరులోని పోలీస్ స్టేషన్లో రోజా అనుచరులు ఈ రోజు ఫిర్యాదు చేశారు.

పర్యవసానంగా హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తి అనే కార్యకర్తలతో పాటు 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కేబీఆర్‌పురంలో సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో దాడి చేశారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles