Pawan Kalyan sleeps on the road in Amaravati పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు.. టెన్షన్..

Police obstructs jana sena chief pawan kalyan at mandadam

Janasena, Pawan Kalyan, Mangalagiri, Amaravati, shifting of capital, 29 Villages, Three Capitals, YSRCP Government, vishakapatnam, Rayalaseema, division between regions, HighCourt, Kurnool, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan was blocked by police while he was on his way to Madadam village from Krishnayapalem. The police have directed him to move on to Tulluru for which the Jana Sena cadre and farmers fired at police.

పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనలో టెన్షన్.. పోలీసుల ఆంక్షలు

Posted: 12/31/2019 02:55 PM IST
Police obstructs jana sena chief pawan kalyan at mandadam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి వికేంద్రీకరించి మూడు ప్రాంతాలలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్న సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో నిరసనలను వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంతాలలో పర్యటించి.. ఆక్కడి రైతులను పరామర్శిస్తూ వెళ్తున్న పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా.. మందడం సమీపంలో పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను నేరుగా తుళ్లూరు వెళ్లాలని పోలీసులు సూచించారు.

మందడం మీదుగా మంగళగిరికి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడానికి వీళ్లేదంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు పవన్ కాన్వాయ్‌ ముందుకు వెళ్లకుండా తాళ్ల సాయంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానిక రైతులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దాదాపు 200 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచె వేసి, పొక్లెయిన్‌ అడ్డుగా పెట్టి కాన్వాయ్‌ ముందుకెళ్లకుండా చేశారు.

దీంతో పోలీసుల వేసిన ఇనుప కంచెలను జనసేన కార్యకర్తలు, రైతులు తొలగించి పవన్ పర్యటను ముందుకు సాగాలే దోహదపడ్డారు. అయితే పోలీసుల చర్యలతో ఆగ్రహానికి గురైన పవన్ కల్యాన్.. కారు దిగి కాలినడకన మందడం గ్రామానికి బయలుదేరారు. దీంతో ఆయన వెంట నడిచిన అభిమానులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాలుగు కిలోమీటర్ల దూరం కూడా తాను కాలినడకనే వెళ్తానని చెప్పిన పవన్ కల్యాణ్ తనను ఎవరు అడ్డుకుంటారో..  ఎలాంటి ఆంక్షలు విధిస్తారో చూస్తానని కూడా సవాల్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో జరిగిన రైతుల పోరాటం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. అలాగే అమరావతి రైతుల అంశం కూడా చాలా పెద్ద సమస్యేనని పేర్కోన్న ఆయన ఈ విషయం కూడా దేశంలోని రైతులందరీకీ తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కాగా, పవన్ ను అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంత రైతులు వెంకటపాలెం చెక్‌పోస్టు వద్దకు భారీగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

చెక్ పోస్టు వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో మందడం మీదుగా సీఎం వెళ్లాల్సి ఉందని, సీఎం వెళ్లే వరకు వేచి చూడాలని పోలీసులు పవన్ కు సూచించారు. పోలీసుల సూచనమేరకు పవన్‌ అక్కడే వేచి ఉన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు, రైతులు నినానాదాలు చేశారు. రహదారికి అడ్డంగా కంచె వేయడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles