Priyanka Gandhi fined Rs 6000 for traffic violations ప్రియాంక గాంధీ వెళ్లిన వాహనదారుడిపై జరిమానా

Congress worker who gave ride to priyanka gandhi fined for traffic violations

urban naxals, Prime Minister Modi, students, intellectuals, CAA Protest, NRC protests, congress worker challaned, priyanka gandhi lucknow police, UP police priyanka gandhi, priyanka gandhi scoooty, Dheeraj Gurjar, Uttar Pradesh Politics, Crime

The Uttar Pradesh traffic police has slapped a fine of ~6,100 on the owner of the two-wheeler on which Congress leader Priyanka Gandhi Vadra travelled to retired IPS officer SR Darapuri’s residence in Lucknow as she and the driver rode the vehicle without helmet, a senior official said

ITEMVIDEOS: సీఏఏ నిరసనలు: ప్రియాంక గాంధీ వెళ్లిన వాహనదారుడిపై జరిమానా

Posted: 12/30/2019 02:26 PM IST
Congress worker who gave ride to priyanka gandhi fined for traffic violations

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.? అన్నట్లు.. అధికారంలో వున్నవారు తలచుకుంటే ప్రత్యర్థి పార్టీలను, పార్టీ నేతలను ఎన్ని రకాలుగానైనా ఇబ్బందుల పాటు చేయవచ్చు అనేందుకు ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇదే ప్రభుత్వ తొలి పర్యాయాం అధికారంలో వుండగా.. సాక్ష్యాత్తు కేంద్ర రవాణా శాఖ మంత్రిగా వున్న నితిన్ గడ్కారీ.. హెల్మెట్ లేకుండానే మహారాష్ట్రలో పర్యటించారు. అంతేకాదు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలో సాగిన ర్యాలీలోనూ ఆయన హెల్మెట్ ధరించలేదు. అయినా కేసులు వుండవు.. జరిమానాలు ఊసు అసలే వుండదు.

కానీ ప్రత్యర్థి పార్టీలు నేతలు చేసే ఏ పనినైనా రంధ్రాన్వేషణ చేసే ప్రభుత్వాలు.. వారిపై ఎలా బదులు తీర్చుకుంటాయనడానికి ఇది నిదర్శనం. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు అందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. అందోళనలను చేపడుతున్నవారంతా అర్బన్ నక్సలైట్లు అని అభివర్ణించారు. దీంతో ఈ నిరసనలు మరింత అధికమయ్యాయి. ఎంతో మంది మేధావులు, విద్యార్థులు తమ వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అందోళనకు మద్దతు ప్రకటించిన మాజీ ఐపీఎస్ అధికారి దారాపురిని పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీతో పాటుగా ప్రియాంక గాంధీ లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి తమ సానుభూతిని వ్యక్తం చేయాలని భావించిన ప్రియాంక గాంధీ.. పోలీసుల వారి కళ్లు గప్పి తప్పించుకుని, పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ తో కలిసి బైక్‌పై బయలుదేరారు. వీరిద్దరూ బైక్‌పై వెళ్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, బైక్ నడుపుతున్న ధీరజ్ కానీ, వెనక కూర్చున్న ప్రియాంక కానీ హెల్మెట్ ధరించకపోడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.

హెల్మెట్ ధరించకపోవడంతో పాటు పలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ.6100 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు రూ.2500, హెల్మెట్లు ధరించనందుకు రూ.500, నిబంధనలు పాటించనందుకు రూ.300, తప్పుడు నంబరు ప్లేట్ కలిగినందుకు రూ.300, నిర్లక్ష్యంగా నడిపినందుకు రూ.2500 చొప్పున మొత్తంగా రూ.6100 జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన చలానను బైక్ యజమాని రాజ్ దీప్ సింగ్ కు పంపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని అధికార సభ్యులకు మాత్రం ఇవి వర్తించవా అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles