CBN asserts police to act wise అమరావతి రైతుల అరెస్టులపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu naidu furious on government over farmers arrest

Chandrababu Naidu, Farmers protest, AP Capital Issue, Amaravati, Amaravati protesters, YS Jagan, Three Capitals, Amaravati, Amaravati Bandh, !44 Section, Visakhapatnam, kurnool, Assembly, committee report, executive capital, legislative capital, judicial capital, Amaravati project cost, regional imbalance in India, Jagan Mohan reddy, Andhra Pradesh vs Telangana, national interest, Andhra Pradesh, Politics

TDP chief Chandrababu Naidu was furious over the arrest of farmers in Amaravati area who were staging dharna. He strongly condemned the police actions. Chandrababu held a teleconference with party leaders over farmers' arrest.

రైతుల అరెస్టులపై చంద్రబాబు ఆగ్రహం.. ‘‘ఇదా వారి త్యాగానికి నిరతం’’టూ ధ్వజం

Posted: 12/30/2019 01:20 PM IST
Chandrababu naidu furious on government over farmers arrest

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సీడ్ క్యాపిటల్ గా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో గత 13 రోజులుగా నిరసనలు, అందోళనలు చేస్తున్న రాజధాని రైతులను అరెస్టు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు చర్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. పోలీసులు కూడా కొంత విజ్ఞతతో ఆలోచించాలని సూచనలు చేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో సర్వం త్యాజించిన రైతులకు అండగా నిలిచి.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారికి త్యాగానికి కటకటాల శిక్షను నిరతిగా ఇస్తుందా.? అంటూ మండిపడ్డారు.

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న వాళ్లపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులపై హత్యాయత్నం కింద అభియోగాలను నమోదు చేయడాన్ని తప్పుబట్టిన ఆయన పోలీసులు కూడా రాజధాని రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ప్రకటన నేపథ్యంలో జరిగిన ఘటనలకు పోలీసులు రైతులపై పెట్టిన సెక్షన్లకు పొంతన వుందా.? అంటూ ఫైర్ అయ్యారు. అర్థరాత్రి ఇళ్ల ప్రహరిగోడలు దూకి రైతులను అరెస్టు చేస్తారా.? అంటూ ప్రశ్నించారు.

రైతులను గుండాలు, దొంగల మాదిరిగా పరిగణిస్తారా.? వారి కుటుంబాల్లోని మహిళలు, వృద్దులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం.? ఈ క్రమంలో వారి కుటుంబాలు చెందిన భాయందోళనకు ఏ ప్రభుత్వం, ఏ పోలీసులు తీర్చగలరంటూ మండిపడ్డారు. 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి అందించిన రైతులను పెయిడ్ అరిస్టులంటూ అవమానించింది చాలక.. అరెస్టులతో అందోళనను అరికట్టాలని చూస్తారా..? అందుకనే వారిపై హత్యాయత్నం సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారా.? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతులను మీడియాపై దాడి కేసులో అరెస్టు చేసిన పోలీసులు వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. రైతులను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిడంతో విచారించిన న్యాయస్థానం రైతులపై పెట్టిన హత్యాయత్నం సెక్షన్లు సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో హత్యాయత్నానికి ఆధారాలు ఏమున్నాయని పోలీసులను ప్రశ్నించింది. తక్షణం హత్యాయత్నం అభియోగాలకు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని అదేశించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులపై హత్యాయత్నం కేసును సెక్షన్లను 373గా మార్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles