Hero Rajasekhar driving license suspended హీరో రాజశేఖర్ కారు నడిపితే.. కటకటాలే..!

Hero rajasekhar driving license suspended by rta officials

Tollywood hero, Rajasekhar, driving license, suspended, Regional Transport Authority, Cyberabad Traffic Police, negligent driving, Telangana, Crime

The driving license of Tollywood hero Rajasekhar has been suspended by the Regional Transport Authority for a period of six months. The Cyberabad Traffic Police had earlier written to RTA seeking suspension of Rajasekhar’s driving license as he was involved in negligent driving.

హీరో రాజశేఖర్ కారు నడిపితే.. కటకటాలే..!

Posted: 12/18/2019 12:14 PM IST
Hero rajasekhar driving license suspended by rta officials

టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఇకపై తన కారును డ్రైవింగ్ చేస్తే.. ఆయన జైలుకు వెళ్లే అవకాశాలు వున్నాయని అంటున్నారు పోలీసులు. ఆయన తన కారును డ్రైవింగ్ చేస్తున్నట్లు నగరంలోని ఏ సీసీ కెమెరాల్లో రికార్డైయినా.. ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఆయన డ్రైవింగ్ లైసెన్సును పోలీసులు తాత్కాలికంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయనపై ఈ చర్యలకు పోలీసులు ఉపక్రమించేందుకు సన్నధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్టీఏ అధికారులు మీడియాకు వెల్లడించారు.

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో రాజశేఖర్.. గత దశాబ్దమున్నర కాలంగా సినిమాలతో కాకుండా ఇతరాత్ర వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తన తల్లి మరణాన్ని దిగమింగుకోలేక ఆయన కొంత మానసిన అవేదనకు గురై ఇలా వ్యవహరించారని ఆయన సతీమణి, నటి జీవిత మీడియాకు తెలిపారు. ఆ తరువాత గత నెల 13న ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని టోలీచౌకీ ఆర్టీఏ అధికారులకు శంషాబాద్ పోలీసులు లేఖ రాశారు.

దీంతో వారు ఈ ఏడాది నవంబరు 29 నుంచి వచ్చే ఏడాది మే 20 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక ఆయనకు కారు నడిపించే అవకాశాలు దూరమయ్యాయి. అయితే ఆయన ఒకవేళ కారు నడిపిస్తే.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపర్చాలని రెడీ అవుతున్నారు. ఇదిలావుంటే.. ఆయన డ్రైవింగ్ లైసెన్సును సప్పెండ్ చేయాలని కోరడంతో మరో విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం విస్తుపోయారు.

నిజానికి రాజశేఖర్ డ్రైవింగ్ లెసెన్స్ అసలు మనుగడలోనే లేదని తేలింది. దీంతో షాకైన పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న నటుడిపై మరో కేసు నమోదు చేయాలని తాజాగా నిర్ణయించారు. రాజశేఖర్ వాహనంపై ఏడాదిలో 21 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్టు తేలింది. వీటిలో 19 పరిమితికి మించిన వేగానికి సంబంధించినవే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన లైసెన్స్ సస్పెన్షన్‌లో ఉండడంతో ఇప్పటికిప్పుడు పునరుద్ధరించుకోవడం సాధ్యం కాదని, మే 28 తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని సమాచారం. లైసెన్స్ లేకుండా అప్పటి వరకు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles