Bulandshahr gang-rape main accused dead తల్లికూతుళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మృతి

Bulandshahr gangrape main accused dies after prolonged kidney ailment

Bulandshahr gangrape, bulandshahr gangrape main accused, gangrape main accused dies, kidney ailment, Atul Kumar Srivastava, Bawaria gang, Saleem Bawaria, Zubair, Sajid, gangrape, CBI, Uttar Pradesh, crime

Salim Bawaria, the man accused in the Bulandhshahr gangrape case, recently underwent dialysis at a hospital in Delhi. His condition deteriorated early Sunday morning after which he was rushed to the district hospital in Bulandshahr but he died on the way.

తల్లికూతుళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మృతి

Posted: 12/17/2019 11:24 AM IST
Bulandshahr gangrape main accused dies after prolonged kidney ailment

తల్లికూతుళ్లపై అత్యంత ఘోర ఘాతుకానికి పాల్పడిన ఘటనలో దుర్మార్గుడు మరణించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్‌ 2016లో చోటుచేసుకుంది. సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సలీం బవారీ మృతి చెందాడు. కిడ్నీ వ్యాధితో బాధపడతున్న పాపాత్ముడు ప్రభుత్వాసుపత్రిలో తరలించేలోపు మార్గమధ్యంలోనే మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని బవారియా జిల్లాలో కరుడుగట్టిన ముఠాగా పేరొందిన సలీం బవారియా ముఠా.. దారిదోపిడీలతో పాటు పలు సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతుండేది.

జూలై 2016లో జాతీయ రహదారిపై ఢిల్లీ నుంచి కాన్పూర్ కు తమ కారులో వెళ్తున్న ఓ కుటంబాన్ని.. తన ముఠాసభ్యులైన జుబేర్, సాజిద్ లతో కలిసి బులంద్ షహర్‌ వద్ద ఓ కుటుంబాన్ని అడ్డగించాడు. ఆరుగురు సభ్యులున్న ఆ కారులో మగవాళ్లందరినీ చెట్లకు కట్టేసి.. కారులో వున్న తల్లితో పాటు పదమూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో సలీం బవారియాతో పాటుగా అతడి స్నేహితులు జుబేర్‌, సాజిద్ లపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

ప్రస్తుతం వీరంతా బులంద్‌షహర్‌ జైలులో జుడిషియల్ రిమాండ్ లో వున్నారు. కాగా కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సలీం ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో అతడిని ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించగా... డయాలసిస్‌ నిర్వహించారు. అయితే సలీం ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారడంతో అతడిని తిరిగి బులంద్‌షహర్‌కు తీసుకురాగా మృతి చెందాడని జిల్లా ఎస్పీ అతుల్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. సామూహిక అత్యాచార కేసులో మిగిలిన నిందితులు ఇద్దరూ బులంద్‌షహర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bulandshahr gangrape  main accused  kidney ailment  Bawaria gang  gangrape  CBI  Uttar Pradesh  crime  

Other Articles