stint in jail had made him strong: Chidambaram ప్రధాని మౌనమే దేశ అర్థిక వ్యవస్థకు శాపం: చిదంబరం

Chidambaram reveals what his first thought was after coming out of tihar jail

Chidambaram, supreme court, ed, inx media case, chidambaram gets bail, chidambaram bail plea, chidambaram news, verdict on chidambaram bail plea, inx media case, chidambaram bail, chidambaram case, p chidambaram news, p chidambaram, karti chidambaram, p chidambaram bail plea, sc order on chidambaram bail, congress leader p chidambaram plea, Crime

Former Finance Minister, senior Congress leader P Chidambaram on Thursday lashed out at the Central government and expressed concern over the "75 lakh people of the Kashmir Valley who have been denied their basic freedoms since August 4

ప్రధాని మౌనమే దేశ అర్థిక వ్యవస్థకు శాపం: చిదంబరం

Posted: 12/05/2019 02:58 PM IST
Chidambaram reveals what his first thought was after coming out of tihar jail

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో వున్న ఆయన 106 రోజుల తరువాత బెయిల్ లభించడంతో బయటకు వచ్చిన ఆయన వచ్చీ రాగనే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. అపకారికి కూడా ఉపకారం చేయడం తమ విధానమని.. కక్షసాధింపు రాజకీయాలు తాము చేయబోమని అన్నారు. అయితే ఎవరు ఈ విధానాలను అవలంబిస్తున్నారో కూడా దేశ ప్రజలందరికీ తెలుసునని పరోక్షంగా మోడీ సర్కారుపై విమర్శలు చేశారు.  

బీజేపి ప్రభుత్వహయాంలో కేంద్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, అర్థిక వ్యవస్థను కేంద్రం కుప్పకూల్చిందని ఆయన అన్నారు. ఇది ఆర్థిక మాంద్యం కాదని తమకు తెలుసునని, అయినా.. ఇంత నత్తనడకన ఆర్థిక వృద్ది సాగడమెందుకు జరుగుతొందని ఆయన ప్రశ్నించారు. ఇక నెమ్మదిస్తున్న ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ఎన్నడూ నోరు విప్పరని ఆయన దుయ్యబట్టారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశానో అందరికీ తెలుసని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.

దేశంలో ఉల్లి ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. ప్రజలకు బీజేపీ నేతలు చాలా హామీలిచ్చారని, వాటి గురించి పట్టించుకోవట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వ తిరోగమన ఆర్థిక విధానాలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని అన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, మూకదాడులు దేశంలో శాంతిభద్రతలను సైతం ప్రశ్నించేలా మారుతున్నాయని అన్నారు. మన అడపడచులపై ఇలా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఒక్క రోజునే ఇలాంటి ఆరు ఘటనలు తన దృష్టికి వచ్చాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles