High court gives nod to municipal elections మున్సి‘పోరు’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. త్వరలో నగరా.!

High court gives green signal to municipal elections

Municipolls, voters list, delimit of wards, municipalities, municipal corporations, Municipal Elections, Telangana High Court, Hyderabad, Telangana, politics

The Telangana High Court on Friday issued a green signal to hold elections to 121 municipalities in the state. However, the court directed the government to re-hold the pre-election process of the municipal elections in 14 days.

మున్సి‘పోరు’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. త్వరలో నగరా.!

Posted: 11/29/2019 02:54 PM IST
High court gives green signal to municipal elections

తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో మరోమారు ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. దీంతో రమారమి ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆరు మాసాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల స్థాయిలో మరోమారు పురపాలక ఎన్నికలకు నగరా మ్రోగనుంది. ఈ సందర్బంగా మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను ఎత్తివేసినట్లు స్పష్టం చేసిన న్యాయస్థానం.. వాటిలో కూడా ఎన్నికలు జరిపించేందుకు అనమతిని మంజూరు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించిన న్యాయస్థానం ఆ తదనంతరం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని న్యాయస్థానం ఈ ప్రభుత్వానికి రెండు వారాల సమయాన్ని సూచించింది.

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరుగుతున్న నేపథ్యంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ ఈ కేసులో తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన క్రమంలో రాష్ట్రంలోని 13 మునిసిపల్ కార్పోరేషన్లకు, 121 మునిసిపాలిటీలకు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వీటిలో జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషనక్లకు కాల పరిమితి ముగియలేదు. వీటితో పాటు సిద్దిపేట, అచ్చంపేట మునిసిపాలిటీలకు పదవీకాలం ముగియలేదు.

ఇక మరో ఐదు పురపాలక సంఘాల్లో పలు కారణాల చేత ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికల నగరా మ్రోగిన తరుణంలో వీటిని మినహాయించి మిగతా అన్ని పురపాలక సంఘాల పరిధిలో ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు సమాయత్తం కానున్నాయి. కాగా, ఈ సంవత్సరం జనవరి 1 నాటికి నమోదైవున్న ఓటర్ల జాబితా ప్రకారమే మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles