Maha Politics: NCP tries to win back Ajit Pawar ‘మహా’ రాజకీయం: ఒక్కడే అక్కడ.. 53 మంది ఇక్కడే..

Ajit pawar only ncp mla supporting bjp party says 53 mlas with sharad pawar

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Ajit pawar, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, bjp, congress, sonia gandhi, sharad pawar, sonia gandhi sharad pawar meeting, shiv sena, maharashtra govt formation, Maharashtra, Politics

NCP leaders and the Pawar family has reached out to Ajit Pawar and are making all efforts to bring him back into the party fold. Ajit Pawar said, "I am in the NCP and shall always be in the NCP and Sharad Pawar Saheb is our leader.

అజిత్ ను తిప్పుకోవడంలో ఎన్సీపి ప్రయత్నాలు ఫలించేనా.?

Posted: 11/25/2019 03:47 PM IST
Ajit pawar only ncp mla supporting bjp party says 53 mlas with sharad pawar

మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం మారుతూ మరఠ్వాడవాసులను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి..ఎన్సీపీ పార్టీ నుంచి విడిపోయి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవర్ మినహాయించి ఏఒక్కరూ బీజేపికి మద్దతునివ్వడం లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇటీవల జరగిన ఎన్నికలలో తమ పార్టీ తరపున గెలిచిన 54 మంది ఎమ్మెల్యేలలో 53 మంది తమతోనే వున్నారని వెల్లడించింది. అయితే ఒకే ఒక్క ఎమ్మెల్యే అయిన అజిత్ పవార్ మాత్రమే బిజేపికి మద్దతునిస్తున్నారని తెలిపింది.

కాగా, ఆ ఒక్కడిని కూడా తిరిగి తమ గూటికే రప్పించుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నాలు చే్స్తోంది. బీజేపికి గట్టిగా బుద్ది చెప్పాలంటే ఆ వైపుకు ఆకర్షితుడైన తమ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అజిత్ పవార్ ను కూడా తమవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూనే వుంది. ఇందులో భాగంగా ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా కొనసాగింది. అజిత్‌ పవార్ ను అసెంబ్లీలోని ఆయన గదిలో కాసేపు ఎన్సీపీ నేతలు నిలువరించినట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌.. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

త్వరలోనే బీజేపీ-ఎన్సీపీ (అజిత్‌ వర్గం) బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అజిత్‌ పవార్‌ భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి.. కాసేపు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ అధినేత శరద్‌ పవార్‌తో మాట్లాడించినట్టు సమాచారం. అంతకుముందు ఎన్సీపీ సీనియర్‌ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ అజిత్‌తో భేటీ అయి చర్చలు జరిపారు. శరద్‌ పవార్‌ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతునివ్వబోరని ఛగన్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్‌ మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి వస్తారా? లేక బీజేపీతో ముందుకు సాగుతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

ఇదిలావుండగా, బీజేపీతో చేయి కలిపిన అజిత్ పవార్ కు రెండు రోజుల్లోనే ఊరట లభించింది. తొమ్మిది అవినీతి కేసుల్లో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నీటిపారుదల ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేసును కూడా మూసేశారు. ఈ సందర్భంగా ఏసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, అజిత్ పవార్ పై ఎలాంటి అవినీతీ కేసులు లేవని తెలిపారు. మరోవైపు, ఈ కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడంపై శివసేన, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించాయి. కేసులను దృష్టిలో ఉంచుకునే బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చారని... ఇదంతా డీల్ లో భాగమేనని విమర్శించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles