Rajasthan: 14 killed in road accident in Bikaner ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Rajasthan road accident 14 dead after bus collides with truck on nh 11 near bikaner

Bikaner, National Highway 11, bikaner road accident, accident on National Highway, Rajasthan Road Accident, Rajasthan road tragedy, Rajasthan Road Accident, Shri Dungargarh, India, Crime

In a tragic incident, at least 14 people died and more than 20 people injured after a bus collided with a truck near Shri Dungargarh area of Rajasthan's Bikaner district

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి

Posted: 11/18/2019 10:32 AM IST
Rajasthan road accident 14 dead after bus collides with truck on nh 11 near bikaner

రాజస్థాన్ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదరెదురుగా వస్తున్న వాహనాలు అదుపుతప్పి ఒకదాన్ని ఒక్కటి పరస్పరం ఢీకొన్న ఘటనతో 11వ నెంబరు జాతీయ రహదారి నెత్తురోడింది. రాజస్థాన్ లోని బికనేర్‌ జిల్లా శ్రీదంగర్ గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఓ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 14 మంది మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే 10 మంది మృతిచెందగా, మరో నాలుగురు అసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. కాగా మరో 18 మందికి తీవ్రగాయాలయ్యారు. క్షతగాత్రుల్లో మరికొందిరి పరిస్థితి కూడా విషమంగానే వుందని వైద్యులు తెలిపారు.

ప్రమాదఘటనా జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించేందుకు బరిలోకి దిగారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు కూడా సహాయకచర్యలు చేపట్టారు. ముందుగా క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సులో వున్న ప్రయాణికులు బయటకు రాలేక అందులోనే చిక్కుకున్నారు.

జేసీబిలను తెప్పించిన పోలీసు అధికారులు లారీ నుంచి బస్సును వేరు చేసి.. ఆ తరువాత బస్సులో చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆర్థనాధాలతో ఆ ప్రాంతంలో విషాధం అలుముకుంది. కాగా, ఈ దుర్ఘటనకు అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. లారీ అతివేగంగా వచ్చి బస్సును బలంగా ఢీకొనిందని, దీంతో బస్సు ముందు భాగం నుజ్జనుజ్జయ్యిందని తద్వారా బస్సు ప్రమాదంలో 14 మంది అసువులు బాసారని పోలీసులు తెలిపారు. మరికోందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి, అందులో చిక్కుకున్నారు. జేసీబి, క్రేన్ సాయంతో బస్సును, లారీని వేరుచేయడానికి పోలీసులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమించారు. దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bikaner  National Highway 11  Rajasthan Road Accident  Shri Dungargarh  India  Crime  

Other Articles