CPI leader Gurudas Dasgupta passes away అస్తమించిన శ్రామికవర్గ స్వరం.. సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా ఇకలేరు..

Veteran communist party leader gurudas dasgupta dies at 83

Gurudas Dasgupta, Communist Party of India, Gurudas Dasgupta dead, cpi leader dead, Gurudas Dasgupta lung cancer, Gurudas Dasgupta CPI leader dead, union leader, working class, cpi, lung cancer, kolkata, west bengal, national Politics, Politics

Former Lok Sabha member and Communist Party of India (CPI) leader Gurudas Dasgupta passed away in Kolkata on Thursday morning. He was just three days short of his 83rd birthday on November 3.

అస్తమించిన శ్రామికవర్గ స్వరం.. సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా ఇకలేరు..

Posted: 10/31/2019 01:09 PM IST
Veteran communist party leader gurudas dasgupta dies at 83

శ్రామికవర్గ హక్కులే తన శ్వాసనిశ్వాసలుగా జీవించిన మహానేత.. కమ్యూనిస్టు కురువృద్ధుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో పాటు హృదయ సంబంధ వ్యాధితో సతమతమవుతున్న గురుదాస్‌ ఈరోజు ఉదయం కోల్‌కతాలోని భవానీపూర్ లో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జయశ్రీ దాస్ గుప్తా, ఓ కుమార్తె ఉన్నారు. గురుదాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్న బారిసలా ప్రాంతంలో 1936 నవంబరు 3న జన్మించారు.

పోరాట యోధుడిగా, వాక్చాతుర్యం ఉన్న నేతగా పేరున్న గురుదాస్‌ దాస్‌గుప్తా రెండుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎంపికై  రెండున్నర దశాబ్దాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా సేవలందించి.. శ్రామికవర్గ హక్కుల కోసం అనునిత్యం పోరాటం చేశారు. ఆయన మంచి రచయిత కూడా. ‘సెక్యూరిటీస్‌ స్కాండల్‌- ఏ రిపోర్ట్‌ టు ది నేషన్‌’ అన్న పుస్తకాన్ని ఆయన రాశారు. 1985, 1988, 1994 సంవత్సరాల్లో రాజ్యసభకు ఎంపికైన ఆయన 2004లో పంక్ సురా నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.

2009లో ఘాటల్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 15వ సభలో సీపీఐ లోక్‌సభా పక్షం నేతగా కూడా పనిచేశారు. 2001లో ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌  (ఏఐటీయూసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2జీ స్ప్రెక్ట్రం కుంభకోణంపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దుతు పలికిన సీపీఐ పార్టీలో కొనసాగుతూ కూడా ఆయన శ్రామిక వర్గం హక్కులపై యూపీఏ ప్రభుత్వం పలు సందర్భాల్లో ఇరుకున పెట్టారని ఇది ఆయన అకుంఠిత పట్టుదలను తెలియజేస్తోందని కమ్యూనిస్టు సహచరులు కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gurudas dasgupta  union leader  working class  cpi  lung cancer  kolkata  west bengal  national Politics  

Other Articles