12 dead in cylinder blast in Uttar Pradesh's Mau యూపీలో సిలిండర్ పేలి.. 12 మంది మృతి

12 killed 6 injured in mau as 2 storey building collapses after cylinder blast

mau building collapse, mau building collapse, mau cylinder blast building, collapse in mau, cylinder blast in mau, building Cylinder, Blast in mau, mau news, Uttar Pradesh, Mau cylinder blast, mau building collpase, uttra pradesh cylinder blast, uttra pradesh building collapse. uttar pradesh, Crime

At least 12 people died on Monday after a two-storey building collapsed following a cylinder blast in Mohammadabad, Mau in Uttar Pradesh.

యూపీలో పెను విషాదం: సిలిండర్ పేలి.. 12 మంది మృతి

Posted: 10/14/2019 12:32 PM IST
12 killed 6 injured in mau as 2 storey building collapses after cylinder blast

ఉత్తర్‌ప్రదేశ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని మౌ జిల్లా మొహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వలీద్ పూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి పెద్ద విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 11 మృత్యువాత పడ్డగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. విప్ఫోటనం ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. శిధిలాల కింద మరికోందరు చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

సిలిండర్ విస్ఫోటన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో క్షతగాత్రులైన వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించిన పోలీసులు.. శిథిలాలను తొలగించి వాటి కింద ఎవరైనా చిక్కుకుని ఉంటారా.? అని అన్వేషిస్తున్నారు. కాగా, శిధిలాల కింద ఐదేళ్ల బాలుడు చిక్కకున్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడ్ని రక్షించే చర్యలను చేపట్టారు.

పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. విస్ఫోటన ఎలా అసంభవించిందన్న విషయమై కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు తర్వాత భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తమ గుండెలు అదిరిపడేలా విస్ఫోటనం సంభవించిందని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు.

ఘటనా స్థలంలో సహాయకచర్యలు వేగవంతం చేయాలని, శిథిలాల్లో చిక్కుకున్న వారిని వీలైనంత తర్వగా బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, శిథిలాల్లో చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యల్లో పోలీసులకు స్థానికులు సహకరిస్తున్నారు. ఉదయం 7.30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొలుత సిలెండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles