Vodafone take potshots at Jio జియో ఎఫెక్ట్: రిలయన్స్ ఖాతాదారులకు ఐడియా గాలం..

Vodafone idea take potshots at reliance jio on free voice calls

Vodafone, Reliance, Jio, bharti airtel, Airtel, Companies, Economy of India, CNX Nifty, Bharti Airtel, Jio, BSE SENSEX, Reliance Industries Limited, NIFTY 50, Vodafone Idea Limited, Mukesh Ambani, Airtel Africa, Reliance Jio Infocomm, Germany, S&P BSE SENSEX INDEX, TCS, Sun, Telecommunication, technology, business

Vodafone Idea have taken potshots at Reliance Jio’s latest move to charge its users 6 paise a minute for outgoing calls to other telecom operators’ networks. The telcos with their social media campaigns are assuring their users of continuity of their free unlimited calls.

జియో ఎఫెక్ట్: రిలయన్స్ ఖాతాదారులకు ఐడియా గాలం..

Posted: 10/11/2019 02:28 PM IST
Vodafone idea take potshots at reliance jio on free voice calls

భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి అనతికాలంలోనే దేశంలో అత్యధిక మంది కస్టమర్లను కలిగిన సంస్థగా సంచలనాలకు తెరతీసీన రిలయస్ జియో నెట్ వర్క్.. తాజాగా తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేయడంతో పాటు.. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు చేస్తామని ప్రకటించింది. నిమిషానికి 6 పైసలు చెల్లించాలని చెప్పింది. దీంతో షాక్ గురైన కస్టమర్లు.. రిలయన్స్ మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన జియో నెట్ వర్క్ ప్రారంభించే సమయంలో వాయిస్ కాల్స్ కు ఎలాంటి చార్జీలు తీసుకోబోమని, కేవలం డాటాకు మాత్రమే డబ్బులు తీసుకుంటమని, రిలయన్స్ నుంచి ఏ ఇతర నెట్ వర్క్ కు ఫోన్ చేసినా అంతా ఉచితమేనని కూడా సంచలన ఆఫర్ తో కస్లమర్లను పెంచుకునే పనిలో నిమగ్నమైంది. కస్టమర్ల సంఖ్య రిత్యా ఏకంగా దేశంలో నెంబర్ వన్ స్థానంలోకి ఎకబాకిన తరువాత ప్లేటు ఫిరాయించింది. ఇకపై చార్జీలు వసూలు చేస్తామని, కొత్త ఐయూసీ ప్లాన్లు కూడా తీసుకొచ్చింది. వీటితో ఉచితంగా డేటా ఇస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది.

రిలయన్స్ జియో ప్రకటనతో కస్టమర్లు షాక్ లో వుండగా ఎలాంటి అందోళనా చెందవద్దని, ఇతర నెట్ వర్క్ సంస్థలు రిలయన్స్ జియో కస్టమర్లకు గాలం వేస్తున్నాయి. రిలయన్స్ జియో ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే వోడాఫోన్ ఐడియా స్పందించింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసే కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. జియోలా తాము ఐయూసీ ఛార్జీలు వేయమని స్పష్టం చేసింది.

అంతేకాదు రిలయన్స్ మాట తప్పిన విధానంతో పాటు అసలు ఐయూసీ చార్జీలు అంటే ఏంటో.. ఎవరు నిర్ణయిస్తారన్న విషయాలను కూడా కస్టమర్లకు తెలిపే ప్రయత్నం చేసి.. రిలయన్స్ జియో సంస్థను దోషిగా నిలబట్టే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు తాము రిలయన్స్ సంస్థ మాదిరిగా మాట తప్పమని కూడా భరోసా కల్పిస్తుంది. ఐయూసీ ఛార్జీలు అనేవి మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన విషయమని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని ఐడియా-వోడాఫోన్ తెలిపింది.

ఐయూసీ ఛార్జీలను కవర్ చేయడానికి.. ఇతర సర్వీసు ప్రొవైడర్లకు చేసిన కాల్స్ కోసం.. వినియోగదారుల నుంచి  ఛార్జీలు వసూలు చేస్తామని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో చేసిన ప్రకటన తొందరపాటు చర్య అని వొడాఫోన్-ఐడియా ప్రతినిధులు చెప్పారు. ఇంటర్‌ కనెక్ట్ మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినిషన్ ప్రకారం ఐయూసీ ఛార్జీలు అనేది మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయం అని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని, వారు ఆందోళన చెందాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  Airtel  Idea  Vodafone  telecom  markets  equity  telecommunications  technology  

Other Articles